newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రియాంకా వాద్రాకు హస్తం పగ్గాలు..?

15-09-201915-09-2019 12:05:32 IST
Updated On 15-09-2019 12:07:14 ISTUpdated On 15-09-20192019-09-15T06:35:32.047Z15-09-2019 2019-09-15T06:35:27.642Z - 2019-09-15T06:37:14.512Z - 15-09-2019

ప్రియాంకా వాద్రాకు హస్తం పగ్గాలు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు ప్రియాంకా వాద్రా చేతికి వెళ్లనున్నాయా.. ఆమెనే పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నుకోనున్నారా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది. 2004-14వరకు దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తం హవా ఉండేది. సోనియాగాంధీ సారథ్యంలో ఆపార్టీ తిరుగులేని శక్తిగా దూసుకెళ్లింది. పదేళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని స్కాంలు వెంటాడాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతూ వచ్చింది. కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి వీస్తున్న సమయంలో 2014 ఎన్నికల్లో ఎన్డీఏ గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో గతంలో ఎన్నడూలేని రీతిలో కాంగ్రెస్‌ ఓటమిపాలైంది.

ఆ తరువాత సోనియాగాంధీ నుంచి అధ్యక్ష బాధ్యతను రాహుల్‌ గాంధీ స్వీకరించారు. కాంగ్రెస్‌ పార్టీ లో కొత్త జోష్‌నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్రాల వారీగా జాతీయ కార్యవర్గంలో యువ నాయకత్వాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో సీనియర్లు కొందరు రాహుల్‌గాంధీ నిర్ణయాలను విబేధించిన సందర్భాలు ఉన్నాయి. రాహుల్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుండి తన ప్రాముఖ్యతను చాటుకునేలా విజయాలు సాధించలేక పోయారు. వరుసగా రాష్ట్రాల్లో జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలవుతూ వచ్చింది. అయినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ సారథ్యంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు భావించారు.

2017-18 సంవత్సరాల కాలంలో పంజాబ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి మళ్లిd కాస్త పునర్వైభవం సాధించింది. ఆ తర్వాత వెంటనే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీ హయాంలో రాఫెల్‌ కుంభకోణంపైనే ప్రజలకు వివరిస్తూ రాహుల్‌ ఎన్నికలకు వెళ్లారు. కానీ దేశ ప్రజలు రాహుల్‌ వ్యాఖ్యలను విశ్వసించలేదు. దీంతో భారీ మెజార్టీతో బీజేపీ తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకుంది.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌లోకి మునిగిపోయింది. ఆ తర్వాత ఓటమికి అందరూ బాధ్యతలు వహించాల్సిందేనని రాహుల్‌ గాంధీ పేర్కోనడంతో దేశవ్యాప్తంగా పార్టీ పదవులను పలువురు రాజీనామాలు చేశారు. ఈ సమయంలో రాహుల్‌ తన టీంను తయారు చేసుకొనేందుకు ఇలాచేస్తున్నాడని, ఇకనుంచి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడని అందరూ భావించారు. కానీ రాహుల్‌ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన స్థానంలో వేరేవారిని నియమించాలని పార్టీ అధిష్టానానికి సూచించారు. సీనియర్‌ నేతలు ఎంతగా బుజ్జగించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి నూతన అధ్యక్షుడి కోసం పలు పేర్లను సీనియర్‌ నేతలు పరిశీలించారు. కానీ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లిd సోనియానే తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో సోనియాగాంధీ ఇటీవల పార్టీ ముఖ్యనేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. కేవలం సోషల్‌ మీడియా వేదికకే పరిమితం కావొద్దని సూచించారు. మోదీ పాలనలోని లొసుగులను ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని సోనియా నేతలందరికీ సూచించారు.

ఈ తరుణంలో యువనేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని, ఈ మేరకు పరిశీలన చేయాలని పార్టీ సీనియర్‌ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే పార్టీకి గట్టి నాయకత్వం అవసరమని తేల్చిచెప్పారు. ఈ తరుణంలో రాహుల్‌గాంధీకే మళ్లిd పార్టీ పగ్గాలు ఇస్తే బాగుంటుందని పార్టీలోని పలువురు సీనియర్‌ నేతలు సోనియాకు సూచించినట్లు తెలుస్తోంది. కానీ రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవటం, ఇటీవల సోనియా అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరుకాకపోవటంతో ప్రత్యామ్నాయం వైపు సీనియర్‌ నేతలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 

ఈ తరుణంలో ప్రియాంక వాద్రాకి పార్టీ పగ్గాలు అప్పగిద్దామని, రాబోయే కాలంలో ఎన్డీయేను దీటుగా ఎదుర్కొనేందుకు సరియైన లీడర్‌ ఆమే అని పలువురు సీనియర్లు సోనియాకు సూచించినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీని మరోసారి సంప్రదించాలని.. రాహుల్‌ సుమఖత వ్యక్తం చేయకపోతే ప్రియాంకానే ప్రత్యామ్నాయ మార్గమని పలువురు సీనియర్‌ నేతలు సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

రాహుల్‌, ప్రియాంకా ఇద్దరిలో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టకపోతే.. ఇక మోదీని ఎదుర్కోవడం కష్టమన్న అభిప్రాయాన్ని సోనియా దృష్టికి సీనియర్‌ నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.ప్రియాంకా వాద్రా అయినా మోదీని బలంగా ఢీకొనవచ్చని, ఇటీవల ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆమె నాయకత్వ లక్షణాలు బహిర్గమయ్యాయని సోనియా దృష్టికి సీనియర్‌ నేతలు తీసుకెళ్లినట్లు పార్టీలోని పలువురు పేర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో సీట్లు సాధించలేక పోయినా మోదీపై ప్రియాంకా విరుచుకుపడ్డ తీరు, స్థానిక ప్రజల్లో ఆమె కలిసిపోయిన తీరును చూస్తుంటే పార్టీ అధ్యక్ష పగ్గాలు ప్రియాంకాకు ఇస్తేనే రాబోయే కాలంలోపార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను గద్దె దింపే అవకాశం ఉంటుందని పలువురు సీనియర్‌ నేతలు సోనియాకు తగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు పార్టీ శ్రేణుల నుంచి ప్రియాంకా గాంధీ లేదా రాహుల్‌ గాంధీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదన వినిపిస్తుంది. ఈ తరుణంలో పార్టీ రథసారధిగా ప్రియాంక రంగంలోకి దిగుతుందో లేదా వేచి చూడాల్సిందే.

Related image

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle