newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ప్రియాంకా గాంధీ కూడా అంతేనా?

28-06-201928-06-2019 08:32:00 IST
2019-06-28T03:02:00.532Z28-06-2019 2019-06-28T03:01:39.528Z - - 19-10-2019

ప్రియాంకా గాంధీ కూడా అంతేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ తీరేంటో ఆ పార్టీ నేత‌ల‌కే అర్థం కాకుండా ఉంద‌ట‌. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తూర్పు బాధ్య‌త‌లు తీసుకుని ప్ర‌చారం చేసిన ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని జిల్లాల అధ్య‌క్షులు, ఇత‌ర పెద్ద‌ల‌తో విప‌రీతంగా స‌మావేశాలు జ‌రిపారు. 

పార్టీలో కీల‌క ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత త‌ప్పంతా పార్టీ నేత‌ల‌దే అన్న చందంగా కాంగ్రెస్ అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. ఎందుకంటే, యూపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ క‌మిటీల‌ను ఆ పార్టీ అధిష్టానం ర‌ద్దు చేసింది. 

ఉప ఎన్నిక‌ల కోసం ప్ర‌తి జిల్లాలో ఇద్ద‌రితో ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇక యూపీ తూర్పు విభాగానికి ఇంచార్జి హోదాలో ఆ పార్టీ నేత అజ‌య్ కుమార్ వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌క‌టించింది. మ‌రో విష‌యం ఏంటంటే, మొన్న‌టి ఎన్నిక‌ల స‌మ‌యంలో యూపీ తూర్పు విభాగాన్ని ప్రియాంక వాద్రా, ప‌శ్చిమ విభాగాన్ని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింథియా ప్ర‌చారం త‌దిత‌ర బాధ్య‌త‌లు తీసుకున్నారు. 

మొత్తం 80 ఎంపీ సీట్లున్న యూపీలో జ్యోతిరాదిత్య సింథియా ఇంచార్జి హోదాలో 38 సీట్ల‌లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌లు తీసుకున్నారు. అయితే ఆ విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటులో కూడా గెల‌వ‌లేదు. 

అలాగే ప్రియాంక వాద్రా యూపీ తూర్పు ఇంచార్జిగా 42 సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్య‌త‌లు తీసుకున్నారు. సోనియా గాంధీ పోటీ చేసిన రాయ‌బ‌రేలి మిన‌హా మ‌రెక్క‌డా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ‌లేదు. అంతేకాదు, చాలా సీట్ల‌లో డిపాజిట్ కూడా ఆ పార్టీకి ద‌క్క‌లేదు. 

దీంతో త‌ప్పంతా జిల్లాల్లోని పార్టీ నాయ‌కుల‌దే అనీ, ప్రియాంక గాంధీ చ‌రిష్మాను, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను జ‌నంలోకి తీసుకెళ్లడంలో క్యాడ‌ర్ విఫ‌లం అయింద‌ని కాంగ్రెస్ అధిష్టానం వాదిస్తోంది. స‌హ‌జంగా పార్టీ ఓట‌మికి నాయ‌క‌త్వ‌మే బాధ్య‌త వ‌హించాలి. 

కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలా ఉండ‌ద‌ని మ‌రోసారి తేలిపోయింది. యూపీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వానికి ప్రియాంక వాద్రా బాధ్య‌త వ‌హించాలి. కానీ ఆమె మీద ఇలాంటి ఆరోప‌ణ రావ‌డానికి, ఆమె నోటి నుంచి క్ష‌మాప‌ణ విన‌డానికి కాంగ్రెస్ పెద్ద‌లు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. 

అందుకే త‌ప్పంతా జిల్లాల్లోని పార్టీ నాయ‌క‌త్వానిదే అంటూ వారి మీద చ‌ర్య‌లు తీసుకున్నారు. గ‌తంలో కూడా ఈ విధంగానే వ్య‌వ‌హ‌రించారు కాంగ్రెస్ పెద్ద‌లు. 2005లో జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 

అప్ప‌ట్లో టిక్కెట్ల పంపిణీ మొద‌లు, ప్ర‌చారం త‌దిత‌ర బాధ్య‌త‌ల‌ను రాహుల్ గాంధీ ద‌గ్గ‌ర నుంచి నిర్వ‌హించారు. అయితే పార్టీ ఓట‌మి త‌ర్వాత రాహుల్ గాంధీ మీద మ‌చ్చ రాకుండా, అప్ప‌ట్లో బీహార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన స‌దానంగ్ సింగ్ మీద బుర‌దజ‌ల్లారు. ఈసారి కూడా ఇదే ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తున్నారట‌.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   10 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   11 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   11 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle