newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రాణాయామంతో కరోనా మహమ్మారికి చెక్

21-06-202021-06-2020 08:20:02 IST
2020-06-21T02:50:02.137Z21-06-2020 2020-06-21T02:47:49.058Z - - 12-04-2021

ప్రాణాయామంతో కరోనా మహమ్మారికి చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంచుకొస్తున్న అనారోగ్యాలనుంచి కాపాడే శక్తి యోగా, ప్రాణాయామానికి వుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి సందేశం అందించాచారు. ఇంట్లో యోగా ద్వారా కుటుంబం మధ్య మరింత బంధాన్ని పెంపొందించుకోవచ్చని ప్రధాని అన్నారు.

పలు యోగాసనాల వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందన్నారు. కోవిడ్-19 ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థపై దాడిచేస్తుందని, ప్రాణాయామం లేదా బ్రీతింగ్ వ్యాయామాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అందుకే పలు రకాల ప్రాణాయామాలను ప్రజలు నేర్చుకోవాలని అన్నారు. అంతేకాదు, క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్మ విశ్వాసం పెంపొందించడంలో యోగా తోడ్పుతుందన్నారు. కుంగుబాటును, మానసిక దౌర్భల్యాన్ని యోగా దూరం చేస్తుందన్నారు. వత్తిడి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు మోడీ. 

మన ప్రాచీన కాలం నుంచి యోగాను జీవనవిధానంగా మార్చుకున్నారని మోడీ చెప్పారు. యోగా ఐక్యతను పెంచుతుందని, మనుషుల మద్య బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఒకవేళ, మన ఆరోగ్యం, ఆశయాలను చక్కగా తీర్చిదిద్దగలిగితే, మానవత్వ విజయానికి సాక్ష్యంగా నిలిచే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ప్రపంచం ఎంతో దూరంలో లేదని, యోగా ఖచ్చితంగా ఇది జరగడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోరనా వైరస్ విజృంభిస్తున్న వేళ స్వీయనిర్బంధం పాటించాలని యోగాను ఆచరించాలన్నారు. 

‘ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా’ మన జీవితంలో ఒక భాగం చేసుకుందాని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ ఆలోచనా విధానంలోని కర్మయోగ స్ఫూర్తిని బలంగా కొనసాగిద్దామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle