newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రశాంత్ భూషణ్‌కి సుప్రీం జరిమానా.. ఎంతో తెలుసా?

01-09-202001-09-2020 08:47:29 IST
Updated On 01-09-2020 10:12:48 ISTUpdated On 01-09-20202020-09-01T03:17:29.781Z01-09-2020 2020-09-01T03:17:00.812Z - 2020-09-01T04:42:48.848Z - 01-09-2020

ప్రశాంత్ భూషణ్‌కి సుప్రీం జరిమానా.. ఎంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు నిందితులకు జరిమానాలు, శిక్షలు విధిస్తాయి. కానీ ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు చిత్రమయినది. తనకు సుప్రీం కోర్టు విధించిన రూపాయి జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. సుప్రీం తీర్పు అనంతరం  మీడియా సమావేశంలో మాట్లాడారు.

సుప్రీంకోర్టును అగౌరవపరిచేలా తాను ట్వీట్లు చెయ్యలేదని పునరుద్ఘాటించారు. తనకు సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెప్పారు. కోర్టు బలహీన పడితే ప్రజలే బలహీన పడతారని, కోర్టు గెలిస్తే ప్రతి భారతీయుడూ విజయం సాధించనట్లేనని చెప్పారు. 

దేశంలో దృఢమైన న్యాయవ్యవస్థను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే, ధిక్కరణ కేసులో రివ్యూ పిటిషన్‌ వేసే హక్కు తనకుందని చెప్పారు. అయితే, పిటిషన్‌ దాఖలు చేస్తారా? లేదా అన్నది తెలపలేదు. కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్‌ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 

Prashant Bhushan refuses to apologise!..

ప్రశాంత్ భూషణ్ కేసుపై ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య గతంలో వేసిన కార్టూన్ 

సెప్టెంబర్‌ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.

కాగా ఈ రూపాయిని వెంటనే ఆయన తరఫు న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ విరాళంగా ఇచ్చారు. దీనిపై ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘నా న్యాయవాది, సీనియర్ సహచరుడు రాజీవ్ ధావన్.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నాకు ఒక రూపాయి విరాళం ఇచ్చారు. నేను కృతజ్ఞతతో దానిని స్వీకరించాను’’ అని అంతకుముందు ఆయన ట్వీట్ చేశారు.

అలాగే, జనవరి 2018లో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం కూడా సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. న్యాయమూర్తులు ఇలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది.భావప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ ఇతరుల హక్కులను కూడా గుర్తించాల్సి ఉంటుందని సుప్రీం అభిప్రాయపడింది. ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకంగా మారింది. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle