newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రముఖులను వదలని కరోనా వైరస్ మహమ్మారి

26-08-202026-08-2020 18:20:05 IST
Updated On 28-08-2020 14:00:34 ISTUpdated On 28-08-20202020-08-26T12:50:05.721Z26-08-2020 2020-08-26T12:48:16.293Z - 2020-08-28T08:30:34.493Z - 28-08-2020

ప్రముఖులను వదలని కరోనా వైరస్ మహమ్మారి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ తీవ్రత ఇతర దేశాల కంటే మనదేశంలోనే ఎక్కువగా వుంది. ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతూనే వున్నారు. తాజాగా కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఈమధ్యే కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయాయని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. కరోనా మహమ్మారి బారిన పడిన శ్రీపాద్‌ నాయక్‌ ప్రస్తుతం గోవా రాజధాని పనాజీలో ఓ ప్రైవేట్‌ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. 

వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని రావడంతో శ్రీపాద్‌నాయక్‌ ఈ నెల 12 నుంచి పనాజీలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసర చికిత్స అందించాల్పి వస్తోందన్నారు డాక్టర్లు. ఇటు హర్యానా అసెంబ్లీ స్పీకర్‌ జియాన్‌ చంద్‌ గుప్తాతో సహా మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటన విడుదల చేశారు.

వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు స్పీకర్‌కు వైరస్‌ సోకిందని, ఆరుగురు అసెంబ్లీ సిబ్బందికి కూడా కరోనా సోకిందన్నారు.  స్పీకర్‌ ఐసోలేషన్లో వుండడంతో డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వా సభా కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరి కరోనా బారిన పడ్డారు. డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్టు ఆయన తెలిపారు.

అంతేకాకుండా.. ఇటీవల తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. క్వారంటైన్‌కు పరిమితమవ్వాలని కూడా అభ్యర్థించారు. ఆగస్టు 18న ఆ రాష్ట్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. యూపీకి చెందిన ఇద్దరు మంత్రులు కరోనా కారణంగా మృతి చెందారు. 

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులపై ప్రతాపం చూపుతోంది. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. భూమాన క‌రుణాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు అభిన‌య్ రెడ్డికి కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది.‌ దీంతో తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

కాగా ఇటీవ‌లే ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప్రార్థ‌న‌లు కూడా చేశారు.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి కరోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు జూపల్లి. గత వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్న వారు చికిత్స తీసుకోవాలని సూచన‌లు చేశారు. అలాగే జూప‌ల్లి కుటుంబ స‌భ్యుల‌కు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   21 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle