newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలు.. ''మహా''పై అమిత్ షా

14-11-201914-11-2019 11:09:20 IST
2019-11-14T05:39:20.445Z14-11-2019 2019-11-14T05:39:17.147Z - - 14-04-2021

ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలు.. ''మహా''పై అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ పార్టీకీ తలుపులు మూసుకుపోలేదని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తమ మెజారిటీని నిరూపించుకోవడానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సమయాన్ని మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు ఇచ్చామని, ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరికైనా అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని నిరాకరించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు చిన్న పిల్లల వాదనగా ఉంటున్నాయంటూ అమిత్ షా కొట్టిపడేశారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గానూ బీజేపీ, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలకు అవకాశమిచ్చిన గవర్నర్ ఉన్నట్లుండి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై పూర్తిగా మౌనం పాటించిన అమిత్ షా ఎట్టకేలకు మౌనం వీడి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకోవడం ద్వారా ఏర్పడిన అనిశ్చితి కారణంగానే మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనలోకి వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

బీజేపీతోపాటు శివసేన, ఎన్సీపీలకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో తమ అశక్తతతను తెలుపడమే కాకుండా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతును ఏ పార్టీ కూడా సాధించలేకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైందని షా సమర్థించారు.

ఎన్నికల సమయంలో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినప్పుడు శివసేన ఏ సందర్భంలోనూ దాన్ని వ్యతిరేకించలేదని షా తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్రమోదీ, తాను ఎన్నోసార్లు ఈ విషయంపై స్పష్టత ఇచ్చామని, తమ కూటమి ఎన్నికల్లో గెలుపు సాధిస్తే దేవేంద్ర పఢ్నవీస్‌ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగ సభల్లోనే ప్రకటించామని 

షా గుర్తు చేశారు. అప్పుడు ఏ ఒక్కరూ మా ప్రతిపాదనను వ్యతిరేకించలేదని కానీ ఇప్పుడు మాత్రం కూటమి ధర్మానికే తాము తూట్లు పొడిచినట్లు శివసేన మాట్లాడటం విడ్డూరంగా ఉందని షా వ్యాఖ్యానించారు.

ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు 18 రోజుల సమయం ఇవ్వడం ఇంతవరకు జరగలేదని, అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత కూడా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని రాజకీయ పార్టీలను ఆహ్వానించారని షా చెప్పారు. కానీ బీజేపీతో సహా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పర్చలేక పోయాయని షా చెప్పారు. 

ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనా స్థితిలో ఉంచడం జరిగిందంటే దాన్ని వెనక్కు తిప్పే ప్రక్రియ కూడా అందులో ఇమిడి ఉంటుందని, ఏ పార్టీకైనా తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామంటూ వారు గవర్నర్‌ని ఈరోజు కూడా కలసి కోరవచ్చని షా తెలిపారు.

ఈ దఫా ఎన్నికల్లో 105 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న బీజేపీనే మరో 25 మంది సభ్యుల మద్దతు కూడగటలేక ప్రభుత్వ ఏర్పాటు నుంచి వైదొలిగిన నేపథ్యంలో 50 స్థానాలకు కొంచెం అటూ ఇటూగా స్థానాలు సాధించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో వైపల్యం చెందడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle