newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ప్రభుత్వంపై పట్టుకోల్పోతున్న మమత

30-06-201930-06-2019 09:56:10 IST
Updated On 03-07-2019 12:59:52 ISTUpdated On 03-07-20192019-06-30T04:26:10.502Z30-06-2019 2019-06-30T04:25:43.653Z - 2019-07-03T07:29:52.373Z - 03-07-2019

ప్రభుత్వంపై పట్టుకోల్పోతున్న మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలిసి చేస్తున్నారో, తెలీక చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు కానీ, మ‌మ‌త బెన‌ర్జీ ముస్లిం ఓట్ల కోసం ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ట‌. తాజాగా 70 శాతం కంటే అధికంగా ముస్లిం విద్యార్థులు ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్ధులు మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌డానికి ప్ర‌త్యేకంగా గ‌దులు, సిమెంట్ బెంచీలు నిర్మించాలంటూ నిర్ణ‌యించారు మ‌మ‌త బెన‌ర్జీ. ఇందుకు సంబంధించిన జీవో కూడా ఆమె జారీ చేశారు.

మొద‌టి విడ‌త‌గా కూచ్ బెహార్ జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఈ గ‌దుల నిర్మాణం చేప‌ట్టాల‌న్న‌ది మ‌మ‌త ఆదేశం. ఎందుకంటే ఆ జిల్లాలో ముస్లింలు ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. దీంతో బెంగాల్ రాజ‌కీయాల్లో మ‌రోసారి వేడి రాజుకుంది. ఈ జీవో మీద ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇచ్చారు. మ‌త ప్రాతిప‌దిక‌న విద్యార్థుల్లో తేడా చూపిస్తున్నారంటూ ఆయ‌న మ‌మ‌త దీదీ మీద మండిప‌డుతున్నారు. 

ఈ వేర్పాటు వాద నిర్ణ‌యం వెనుక కుట్ర ఉంద‌ని ఆరోపిస్తున్నారు దిలీస్ ఘోష్‌. మ‌మ‌త ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో కాపీని కోడ్ చేస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. ఇక త‌మ అధినేత పిలుపుతో బీజేపీ శ్రేణులు ప‌శ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగాయి. దీంతో వెన‌క్కి త‌గ్గిన మ‌మ‌త బెన‌ర్జీ, ఆ జోవో త‌న‌కు తెలియ‌కుండా జారీ అయిందంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అయితే జీవో మీదున్న సంత‌కం ఎవ‌రిదో చెప్పాల‌ని బీజేపీ డిమాండ్ చేయ‌డంతో, వెంట‌నే స్పందించిన మ‌మ‌త దీదీ, ఆ జీవోను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

త‌న మీద కుట్ర చేయ‌డానికి ప్ర‌భుత్వంలోని కొంద‌రు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారని కూడా మ‌మ‌త బెన‌ర్జీ ఆరోపిస్తున్నార‌ట‌. అంటే, ప్ర‌భుత్వ యంత్రాంగంలో క్ర‌మంగా మ‌మ‌త బెన‌ర్జీ ప‌ట్టు కోల్పోతున్న‌ట్లు ఈ ఘ‌ట‌న ద్వారా అర్థం అవుతోంద‌ని సీపీఎం నేతలు ఎద్దేవా చేస్తున్నారట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle