newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు ఇండియా.. ఐటీ మంత్రి

03-06-202003-06-2020 07:09:29 IST
Updated On 03-06-2020 09:08:37 ISTUpdated On 03-06-20202020-06-03T01:39:29.876Z03-06-2020 2020-06-03T01:39:27.825Z - 2020-06-03T03:38:37.218Z - 03-06-2020

ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు ఇండియా.. ఐటీ మంత్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా  నిలిచిందని కేంద్ర  న్యాయ, టెలికాం శాఖ మంత్రి  రవిశంకర్‌  ప్రసాద్‌ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు తయారైనట్టు  చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. 

2014లో  కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. 

2014లో భారత్‌లో మొబైల్ తయారీ సంస్థలతో పోలిస్తే 2019 నాటికి 200 శాతం పెరుగుదల నమోదైందని కేంద్రమంత్రి ప్రజంటేషన్ ద్వారా తెలిపారు. 2019లో భారత్‌లో తయారైన మొబైల్ ఫోన్ల సంఖ్య 30 కోట్ల 30 లక్షలు దాటిందని వీటి విలువ 3 కోట్ల డాలర్లకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు.

అలాగే నేడు (జూన్ 2న) మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్‌ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్‌ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా  ట్వీట్‌ చేసింది.

భారత్‌ను అతిపెద్ద మొబైల్ తయారుదారు దేశంగా అంతర్జాతీయ మొబైల్ ఉత్పత్తి కంపెనీలు పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారు అయిన భారత్‌తో భాగం పంచుకోవాలని ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి అని ఎలెక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆపెల్‌తో సహా పలు సుప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారత్‌లో స్థానికంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని చూస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు భారత్‌లో తమ ఉత్పత్తులు ప్రారంభించేశాయి. జియోమీ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ, భారత్‌లోని 99 శాతం ఎమ్ఐ, రెడ్ మీ ఫోన్లు మేడ్ ఇన్ ఇండియాకు చెందినవే అని ఇక 65 శాతం విడి భాగాలు స్థానికంగానే లభ్యమవుతున్నాయని చెప్పారు.

ఇండియాలోని తమ కంపెనీలో 35 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, జియోమీ ప్లాంటులో 95 శాతం మహిళలే పనిచేస్తున్నారని మను కుమార్ పేర్కొన్నారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle