newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

06-07-202006-07-2020 07:04:04 IST
2020-07-06T01:34:04.749Z06-07-2020 2020-07-06T01:34:00.086Z - - 10-04-2021

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్‌ సెంటర్‌లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్‌ బైజాల్‌ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్‌ కరోనా వారియర్స్‌’ పేరిట ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది.

1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్‌ సెంటర్‌లో 200 ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్‌లో 20 ఫుట్‌బాల్‌ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్‌డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో భారీ కేంద్రాన్ని నిర్మించ తలపెట్టిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 10 వేల బెడ్స్‌ సామర్థ్యం గల కోవిడ్‌ కేంద్రాన్ని ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు. దక్షిణ ఢిల్లీ సమీపంలోని చత్తర్‌పూర్‌ ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌ను తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పున్న ఈ కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానమైన స్థలంలో నిర్మితమై ఉంది.

చైనాలో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ మేరకు అనిల్‌ బైజాల్‌ ట్విటర్‌ వేదికగా ఆస్పత్రి వివరాలను వెల్లడించారు. ఈ కోవిడ్‌ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు పరిశీలించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ సెంటర్‌లో అవసరమైన బెడ్లు, దిండ్లు, లైనెన్స్ వంటి వాటిని పలు పౌరసమాజ సంస్థలు, ఎన్జీఓలు సమకూర్చారు. కరోనా రోగులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఒంటరితనంలో ఉండే పరిస్థితులను ఈ కోవిడ్ సెంటర్ సృష్టించింది. ఈ ఆసుపత్రి కేవలం పడకల సంఖ్యలో రికార్డు సృష్టించడమే కాకుండా లైబ్రరీ, బోర్డు గేమ్స్, స్కిప్పింగ్ రోప్స్ వంటివాటితో కూడిన రిక్రియేషనల్ సెంటర్‌ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle