ప్రధాని మోదీకి క్వారంటైన్ నిబంధనలు వర్తించవా.. శివసేన ఎంపీ ప్రశ్న
17-08-202017-08-2020 08:08:00 IST
2020-08-17T02:38:00.927Z17-08-2020 2020-08-17T02:37:58.518Z - - 14-04-2021

రామజన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌కి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆయనతో పాటు అయోధ్య రామాలయ భూమిపూజలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ క్వారంటైన్ లోకి వెళతారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. భూమి పూజలో ఆద్యంతం గోపాల్ దాస్ సమక్షంలో గడిపిన మోదీకి క్వారంటైన్ నిబంధనలు వర్తించవా అంటూ శివసేన ఎంపీ ప్రశ్నించారు కూడా. దీంతో ప్రధాని కార్యాలయం స్పందించి తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో కలిసి అయోధ్య భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నిలదీశారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆగస్ట్ 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో 75 ఏళ్ల మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’అని రౌత్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా మాత్రం కోవిడ్ -19కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, ఆగస్ట్ 13న కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా క్వారంటైన్లోకి వెళ్లాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత దేశ రాజధానిని సందర్సించిన సేన నేత రౌత్..ఢిల్లీ నగరం పూర్తిగా కోవిడ్-10 కోరల్లో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ''హోంమంత్రి అమితా షా ఇప్పటికే గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయన ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు... ప్రస్తుతం డిల్లీలోని కేబినెట్ మంత్రులు, బ్యూరాక్రాట్లు, ఎంపీలు ఈ ప్రాణాంతక మహమ్మారి ప్రభావానికి గురయ్యేటట్లు ఉన్నారు. యుద్ధాలు, కల్లోల పరిస్థితుల్లో కూడా ఢిల్లీ ఇంతగా భయపడుతుండటం జరగలేదు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నిజంగానే వణికిపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా అంటేనే వణికిపోతున్న జనం ఇప్పుడు కరోనాతో మరింతగా భీతిల్లిపోతున్నారు'' అంటూ సేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
35 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
2 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
5 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
a day ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago
ఇంకా