newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

ప్రధాని పదవిపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టేనా?

17-05-201917-05-2019 08:46:11 IST
Updated On 17-05-2019 19:01:15 ISTUpdated On 17-05-20192019-05-17T03:16:11.410Z17-05-2019 2019-05-17T03:13:44.916Z - 2019-05-17T13:31:15.696Z - 17-05-2019

ప్రధాని పదవిపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమవుతోంది. తాజా రాజకీయ పరిణామాలు ప్రజల్లో  ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాని పదవిని సైతం వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మానసికంగా సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.తాము ఆ పదవి చేపట్టకపోయినా మిత్రపక్షాల్లో ఎవరో ఒకరు ప్రధాని అయినా తమకు అభ్యంతరంలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. 7వ విడత ఎన్నికల పోలింగ్ వేళ కాంగ్రెస్ ఈవిధంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసారి జరిగే పోలింగ్ పై ఆజాద్ కామెంట్ల ప్రభావం తప్పక పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పరిస్థితులు తమకు సానుకూల పడకపోతే ప్రధాని పదవిని సైతం త్యాగం చేసి అయినా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వ్యవహారం తెలిసిన వారు మాత్రం అంతగా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే... చివరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ బలమైన నమ్మకం అని కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా... ముందు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే... ఆ తరువాత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టొచ్చని కాంగ్రెస్ లెక్కలు వేస్తోందని మరికొందరు భావిస్తున్నారు.

ప్రధాని పదవి తమకే కావాలనే సంకేతాలను గతంలో కాంగ్రెస్‌ ఇచ్చింది. దీంతో కొన్ని పార్టీలు కాంగ్రెస్‌కు దూరం జరిగాయి.  అయితే ఆజాద్‌ ప్రకటనతో కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విభేదించారు. అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామనీ, సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ వ్యూహం ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle