ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
03-09-202003-09-2020 09:13:06 IST
Updated On 03-09-2020 10:08:23 ISTUpdated On 03-09-20202020-09-03T03:43:06.955Z03-09-2020 2020-09-03T03:43:02.291Z - 2020-09-03T04:38:23.467Z - 03-09-2020

ప్రధాని నరేంద్రమోడీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. చాలామంది ఆయన వ్యక్తిగత ట్విటర్ అనుకుంటున్నారు. కానీ హ్యాకైంది వ్యక్తిగత వెబ్సైట్-యాప్ కి సంబంధించిన ఖాతా. జులైలో అమెరికా ప్రముఖులు, బిలయనీర్ల ఖాతాలను కూడా ఇలాగే హ్యాక్ చేశారు.నరేంద్ర మోడీ ఖాతా హ్యాక్ అయినట్టు ప్రకటించింది ట్విట్టర్. ప్రపంచవ్యాప్తంగా నరేంద్రమోడీ ట్విట్టర్లో హవా కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యే ప్రధాని మోడీ తన ఇంట్లో యోగా చేస్తూ, నెమళ్ళకు ఆహారం వేస్తూ పెట్టిన వీడియోకు లక్షలాది లైకులు వచ్చాయి. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా మరో ఘనతను సాధించారు. తాజాగా ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్‌ను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు ఆరు కోట్లకు పైగా పెరిగింది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. హ్యాకింగ్ కు గురైన అకౌంట్లో ఎలాంటి అభ్యంతకరమయిన సందేశాలు వెళ్ళకుండా ట్విట్టర్ జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది. 2009 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన ట్విటర్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయాన్ని పంచుకుంటున్నారు. పాలనా, రాజకీయ పరమైన ప్రతీ విషయాలను మోదీ క్రమం తప్పకుండా ట్విటర్ వేదికగా ప్రజలతో పంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ట్విటర్ ఫాలోవర్స్ కలిగి ఉన్న రాజకీయ అగ్ర నాయకుల్లో ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 12 కోట్ల 70 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 కోట్ల 37 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఈమధ్యే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది. అది కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడే అది జరగడం గమనార్హం. పాకిస్తాన్‌కు చెందిన దుండగులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం కిషన్ రెడ్డి వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. అయితే ఆగస్టు 15న ఈ వెబ్సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా