newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు? మోడీ ప్రసంగంపై ఉత్కంఠ

30-06-202030-06-2020 12:35:31 IST
Updated On 30-06-2020 12:56:40 ISTUpdated On 30-06-20202020-06-30T07:05:31.911Z30-06-2020 2020-06-30T07:04:34.116Z - 2020-06-30T07:26:40.997Z - 30-06-2020

ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు? మోడీ ప్రసంగంపై ఉత్కంఠ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది.తాజాగా 24గంటల్లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 18,522 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 5,66,840 కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16,893 కి చేరింది. కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకోనీ డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మరో 2,15,125 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 3 లక్షల పై మంది పెరుగుతున్నప్పటికీ ఇంకా 2 లక్షల పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం విధించిన అన్ లాక్ 1.O ఈరోజుతో ముగుస్తోంది.  ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఏయే అంశాలు ప్రస్తావిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ 2 వంటి అంశాలపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. గల్వాన్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనాతో ఉద్రిక్తతలు, ఆదేశానికి చెందిన 59 మొబైల్‌ యాప్‌లను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ఇప్పటి వరకు అయిదు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. మరో వైపు దేశంలో నేటితో అన్‌లాక్‌ 1.0 ముగియనుండగా.. రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 ప్రారంభం కానుంది. 

దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధాన్యత సంతరించుకుంది.

గల్వాన్‌లోయ ఘటన తరువాత తొలిసారి దేశ ప్రజల ముందుకు వస్తున్న ప్రధాని.. చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా స్వయం స్వావలంబన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది. టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఈ అవకాశాన్ని భారతీయ డిజిటల్‌ సంస్థలు అందిపుచ్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చే అవకాశముంది. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle