newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రతీ లక్షమందిలో ఒక్కరే కరోనాతో మృతి! కలవరం వద్దన్న ఆరోగ్యశాఖ

26-06-202026-06-2020 06:40:51 IST
Updated On 26-06-2020 10:40:19 ISTUpdated On 26-06-20202020-06-26T01:10:51.354Z26-06-2020 2020-06-26T01:10:46.691Z - 2020-06-26T05:10:19.875Z - 26-06-2020

ప్రతీ లక్షమందిలో ఒక్కరే కరోనాతో మృతి! కలవరం వద్దన్న ఆరోగ్యశాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఒక్కరు మాత్రమే కరోనా వైరస్ ‌(కోవిడ్‌-19) బారిన పడి మరణిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో ఈ సగటు ఆరు రెట్లు(6.04) ఎక్కువగా ఉందని పేర్కొంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక ప్రకారం.. యూకేలో ప్రతీ లక్ష మందిలో 63.13, స్పెయిన్‌లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీలో 27.32, బ్రెజిల్‌లో 23.68, రష్యాలో 5.62 కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. 

ఆయా దేశాలతో పోలిస్తే సరైన సమయంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిరంతర వైద్య పర్యవేక్షణ తదితర ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగానే దేశంలో మరణాల సంఖ్యను అదుపు చేయగలిగినట్లు తెలిపింది.

బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. 

కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. జూన్‌ 2 నాటికి భారత్‌లో ప్రతి లక్ష మందిలో 0.41 మంది కోవిడ్‌తో మృత్యువాత పడగా.. ప్రపంచవ్యాప్తంగా ఇది 4.9గా నమోదైంది.

ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కోవిడ్‌-19 పరీక్షల ల్యాబ్‌లను వెయ్యికి పెంచేందుకు నిర్ణయించింది. ఇందులో 730 ప్రభుత్వ ల్యాబ్‌లు, 270 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ విషయం గురించి ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం భార్గవ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. 

కోవిడ్‌ వ్యాప్తి తొలినాళ్ల నుంచి 3Tలు అనగా.. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌పై దృష్టి సారించామని తద్వారా వైరస్‌పై యుద్ధానికి సన్నద్ధమయ్యామని తెలిపారు. దేశంలోని ప్రతీ జిల్లాలో కోవిడ్‌ ల్యాబ్‌ నెలకొల్పాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 93.59 లక్షల మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా.. 4.79 లక్షల మంది మరణించారు. అత్యధిక కరోనా కేసులతో అమెరికా (24.42 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ (11.51 లక్షలు), రష్యా (5.99లక్షలు) దేశాలు ఉన్నాయి. అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle