newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రతి ఇంటిలో కోవిడ్ పరీక్షలు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

26-06-202026-06-2020 15:51:37 IST
Updated On 26-06-2020 16:46:12 ISTUpdated On 26-06-20202020-06-26T10:21:37.131Z26-06-2020 2020-06-26T10:21:34.772Z - 2020-06-26T11:16:12.054Z - 26-06-2020

 ప్రతి ఇంటిలో కోవిడ్ పరీక్షలు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంటికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బుధవారం అధికారులను ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్‌ అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. అంతేగాక గడిచిన 24 గంటలలో అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించారు. 

ఢిల్లీలో ప్రతిరోజూ 2,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 75 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో 45 శాతం కేసులు కంటైన్మెంట్‌ జోన్లలోనే నమోదవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా పాజిటివ్‌ వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం అమలులో ఉన్న ప్రణాళికలను సవరించి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో పోలీసు కమిషనర్‌, సివిల్‌ బాడీ అధికారులు, ఎమ్‌సీడీ(మున్సిపల్‌ కార్కొరేషన్‌ ఆఫ్‌ న్యూఢిల్లీ) ఎపిడెమియాలజిస్టులు, కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌‌ న్యాయాధికారులు కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తారు. 

ఆరోగ్య సేతు యాప్‌ను పర్యవేక్షించడానికి.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం ప్రత్యేకంగా ఐటీ నిపుణులను ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఇకపై ఆరోగ్యసేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ముఖ్యంగా కాలుష్య ప్రభావిత పరిసరాల్లోని వారు తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది. 

సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కంటైన్మెంట్‌ జోన్‌ల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. 

ఇక జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడంతో పాటు కంటైన్మెంట్‌ జోన్‌లో 5 నుంచి 10 రోజుల మధ్య కరోనా పరీక్షలు జరుపుతారు. 

శనివారం(జూన్ 27) నుంచి దేశ రాజధానిలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రోజుకు ఇరవై వేల చొప్పున సేకరించిన నమూనాల ఫలితాలను జూలై 10న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   9 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle