newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రతిపక్షంతో సీఏఏపై మాట్లాడాల్సిందే.. కేంద్రానికి సంఘ్ పరివార్ కీలక సూచన

17-03-202017-03-2020 12:20:10 IST
2020-03-17T06:50:10.093Z17-03-2020 2020-03-17T06:50:08.125Z - - 22-04-2021

ప్రతిపక్షంతో సీఏఏపై మాట్లాడాల్సిందే.. కేంద్రానికి సంఘ్ పరివార్ కీలక సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికపై ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత ఆరెస్సెస్ అగ్రనాయకత్వానికి అర్థమైనట్లుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతామంటూ ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ తెగేసి చెబుతున్న నేపథ్యంలో నష్టనివారణకు ఆరెస్సెస్ నేరుగా రంగంలోకి దిగుతున్న సూచనలు కనబడుతున్నాయి. ప్రతిపక్ష నేతలతో సంప్రదించి వారి అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని, కఠిన నిర్ణయాలు అమలుపర్చే ముందు ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు తప్పనిసరని ఆరెస్సెస్ నాయకత్వం తేల్చి చెప్పింది.

ఎన్నార్సీ, సీఏఏ విషయంలో ప్రతిపక్ష నేతల అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, వారితో మాట్లాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి సూచించారు. ప్రతిపక్షాలు జాతీయ సమస్యలను కావాలనే సమస్యాత్మకంగా సృష్టిస్తున్నాయని ఆరోపించారు. 

ఆరెస్సెస్ అత్యున్నత విధాయక నిర్ణయాత్మక మండలి అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో అఖిల భారతీయ కార్యకారిణీ మండలి సమావేశమై కొన్ని నిర్ణయాలను తీసుకుంది.

‘‘ఎన్నార్సీ, సీఏఏ విషయంలో ప్రతిపక్షాలకున్న అన్ని అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిది. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపక్షాలతో చర్చించాలి’’ అని జోషి సూచించారు. 

ప్రతిపక్షాలకున్న సందేహాలను తీర్చడంలో గతంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతిపక్షాలు కూడా అందుకు ముందుకు రాలేదని విమర్శించారు. ప్రతిపక్షాలకు తలెత్తిన సందేహాలను అధికార పక్షం తీర్చాలని, అందుకు ప్రతిపక్షాలు స్పందించాలని, ఈ విషయంలో ప్రతిపక్షాలు సరిగ్గా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు సీఏఏ, ఎన్నార్సీని స్వాగతిస్తూ ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఎవరు విదేశీయులో, ఎవరు కారో అన్నది ఎన్నార్సీ ద్వారా తెలిసిపోతుందని, అలాగే మూడు దేశాల్లో ఇబ్బందులు పడుతున్న మైనారిటీలకు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం కలిపించవచ్చని అన్నారు. 

జిహాదీ, వామపక్ష గ్రూపులు కొందరు అవకాశవాద రాజకీయ పక్షాలతో కలిసి కొన్ని వర్గాల్లో లేనిపోని భయాందోళనలను సృష్టిస్తున్నారని భయ్యాజీ జోషి తీవ్రంగా మండిపడ్డారు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle