newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రణబ్‌కు నేతల నివాళులు... మధ్యాహ్నం అంత్యక్రియలు

01-09-202001-09-2020 08:27:17 IST
Updated On 01-09-2020 10:11:43 ISTUpdated On 01-09-20202020-09-01T02:57:17.205Z01-09-2020 2020-09-01T02:57:11.923Z - 2020-09-01T04:41:43.143Z - 01-09-2020

ప్రణబ్‌కు నేతల నివాళులు... మధ్యాహ్నం అంత్యక్రియలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్యీ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మధ్యాహ్నం2గంటలకు జరగనున్నాయి. అన్ని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమయింది. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని ప్రభుత్వ నివాసానికి తరలించారు.

అనంతరం ప్రధాని మోడీ. రాష్ట్ర పతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాహుల్ గాంధీ.నివాళులు అర్పిస్తారు. 11నుంచి12వరకు ప్రజలు సందర్శించేందుకు అవకాశం ఇస్తారు.

12నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం లోదీరోడ్డు లోని స్మశాన వాటికలో అంత్య క్రియలు జరుగుతాయి.భార‌త ర‌త్న‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్‌ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు.

గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు.దేశ అభివృద్ధికి ప్రణబ్‌ విశేషంగా కృషి చేశారని అన్నారు.పలు పాలనా విధానాలపై ఆయన చేసిన సూచనలు సదా స్మరణీయమని చెప్పారు.భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ సీయం కేసీయార్, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత విచారం వ్య‌క్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం కేసీయార్ గుర్తు చేసుకున్నారు. ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణ వార్త ప‌ట్ల ఆమె ట్విట్ట‌ర్ వేదికగా స్పందించారు. ప్ర‌ణ‌బ్ నిజ‌మైన రాజ‌నీత‌జ్ఞుడు అని ఆమె కొనియాడారు. దేశం కోసం ఆయ‌న నిస్వార్థంగా సేవ చేశార‌న్నారు. ప్ర‌ణ‌బ్‌తో దిగిన ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో మాజీ ఎంపీ క‌విత షేర్ చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రణబ్ ముఖర్జీ మృతి వార్త తెలిసి బాధేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. ప్రణబ్ మృతి వార్త కలచివేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గొప్ప ఆర్థికవేత్త అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle