ప్రచారానికి ఇవాళ్టితో తెర.. 'ఆప్' కి తిరుగేలేదంటున్న సర్వేలు
06-02-202006-02-2020 09:47:35 IST
Updated On 06-02-2020 11:40:02 ISTUpdated On 06-02-20202020-02-06T04:17:35.505Z06-02-2020 2020-02-06T04:17:06.032Z - 2020-02-06T06:10:02.298Z - 06-02-2020

ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఆర్భాటాలకు తెర పడనుంది. ఈనెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి. సీఏఏ నిరసనలు, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు, ఉచిత పథకాలు తెరమీదకు వచ్చాయి. ప్రచారం ముగియడంతో ఇక ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ఎరవేస్తున్నాయి. మరోవైపు ఆప్ విజయం ఖాయమనే సర్వేలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నేతలు మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. ఢిల్లీ లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే తాజాగా ప్రకటించింది. 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ కు 54 నుండి 60 సీట్లు వస్తాయని అంతర్జాతీయ మార్కెట్ రీసర్చ్ సంస్థ IPSOS తో కలిసి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. జనవరి 27 నుండి ఈ నెల 1వ తేదీ వరకు చేసిన ఈ సర్వే బీజేపీకి 10 నుండి 14, కాంగ్రెస్ కు 0 నుండి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓట్లు, బీజేపీకి 34 శాతం, కాంగ్రెస్ కు 4 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తున్న ఆపార్టీకి సర్వేలు షాకిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీసింది. వరుస పరాజయాలతో నిర్వేదంతో ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వస్తున్న అంచనాలతో బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారు.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ఈ మధ్య జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని బీజేపీ కోల్పోతూ వచ్చింది. హరియాణాలో మరో పార్టీతో జతకట్టి అధికారాన్ని నిలబెట్టుకుంది, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈసారి కూడా ఆప్ హవా ఉందని తేలడంతో ప్రతిపక్ష పాత్రకు అవసరం అయిన సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో బలమైన నేతగా పాతుకుపోతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢీ కొట్టే సీఎం అభ్యర్థి కోసం బీజేపీ నేతలు అన్వేషణ మొదలుపెట్టారు. పార్టీలు, సిద్ధాంతాలు చూసి ఓట్లు వేసే రోజులు పోయి, సీఎం అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తున్నారని ఈ మధ్య జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. అయితే అవకాశం కూడా లేకపోవడంతో బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
9 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా