newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రచారంలో కనీస పోటీ ఇవ్వడంలో హస్తం వెనుక‘బాట’

16-10-201916-10-2019 07:58:13 IST
Updated On 16-10-2019 17:28:22 ISTUpdated On 16-10-20192019-10-16T02:28:13.523Z16-10-2019 2019-10-16T02:23:43.074Z - 2019-10-16T11:58:22.845Z - 16-10-2019

ప్రచారంలో కనీస పోటీ ఇవ్వడంలో  హస్తం వెనుక‘బాట’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తేలిపోతున్నది. విజయం సంగతి అటుంచి కనీసం పోటీ ఇవ్వగలమన్న విశ్వాసం కూడా కొరవడినట్లుగా ఆ పార్టీ ప్రచారం సాగుతున్నది. అదే సమయంలో రెండు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉండి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పట్ల ఇసుమంతైనా ఆందోళన లేకుండా బీజేపీ ప్రచారంరలో దూసుకుపోతున్నది.

జాతీయ అంశాలతో పాటూ ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేస్తూ ప్రచార జోరు పెంచేసింది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ సమర్థ నేతను ఎన్నుకోలేనంత బలహీనంగా ఉండటమే.

జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాందీ, పీవీ నరసింహరావు, సోనిగా యాంధీ వంటి దిగ్గజ నేతల సారథ్యంలో రాటు దేలిన పార్టీ ఇప్పుడు  తాత్కాలిక  అధ్యక్షురాలితో నెట్టుకు రావలసిన దయనీయ పరిస్థితిలో పడింది.

మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగం తప్ప మరో సమస్య కనిపించడం లేదంటే...ప్రజాసమస్యల విషయంలో ఆ పార్టీ ఎంత అప్ డేట్ తో ఉందో అర్ధం అవుతున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలోనూ కూడా పార్టీ ప్రచార భారాన్ని వారిరువురూ అలవోకగా మోస్తూ విపక్షాలపై నిప్పులు చెరిగే విమర్శలతో దూసుకుపోతున్నారు.

ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దును బ్రహ్మాస్త్రంగా విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పై సంధిస్తూ కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తున్నారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 కాంగ్రెస్ పుణ్యమేనంటూ...అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం, అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు కూడా సమర్ధించడం కాంగ్రెస్ ప్రచారాన్ని నామమాత్రపు స్థాయికి దిగజార్చేసిందని చెప్పాలి.

కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా దేశ సార్వభౌమాధికారానికి ప్రశ్నార్ధకంగా నిలిచిందని చెప్పాలి. ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పుడు కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న భావన జనబాహుల్యంలో నెలకొంటుండం కూడా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో కమలం పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచిందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా పాకిస్థాన్ దూకుడునూ, దుందుడుకు తనాన్ని అరికట్టి ఆ దేశానికి గట్టి గుణపాఠం నేర్పిన నేతగా మోడీకి ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి ఆర్టికల్ 370 రద్దు, పొరుగుదేశ భూభాగంలోని  ఉగ్రస్థావరాలపై సర్జిలక్ స్ట్రైక్స్ వంటివి దోహదపడ్డాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ ఈ అంశాలే ప్రచారాంశాలుగా బీజేపీ ముందుకు తీసుకువచ్చింది.

దీంతో కాంగ్రెస్ కు ప్రచారం చేసుకోవడానికి మరో అంశం లేకుండా పోయింది. అనివార్యంగానో, గత్యంతరం లేని పరిస్థితిలోనో కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దును ప్రచారంలో వ్యతిరేకించడంతో ఆ పార్టీ మరింత వెనుక బడిందని చెప్పాలి. ఇక చంద్రయాన్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని పలుచన చేశాయి. చంద్రయాన్ ప్రయోగం భారత ప్రతిష్టను ఇనుమడింప చేసింది.

యావత్ భారతం ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాకపోయినా...దేశానికి అది గర్వకారణమైన ప్రయోగంగా భావిస్తున్నది. అటువంటి చంద్రయాన్ ను చులకన చేస్తూ రాహుల్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేయడం వ్యూహ తప్పిదంగా పరిశీలకులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారం ప్రజలలోనికి వెళ్లడం లేదన్న భావన వ్యక్తమౌతున్నది .      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle