newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పౌరసత్వ సవరణ బిల్లుకి కేబినెట్ ఓకె

04-12-201904-12-2019 18:03:54 IST
2019-12-04T12:33:54.302Z04-12-2019 2019-12-04T12:26:32.675Z - - 14-04-2021

పౌరసత్వ సవరణ బిల్లుకి కేబినెట్ ఓకె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా ఇప్పుడు ఎన్ ఆర్ సి బిల్లు గురించే చర్చ జరుగుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక కీలకాంశాలపై దృష్టిపెట్టింది. ఆర్టికల్ 370, తలాక్ బిల్లు తర్వాత దేశంలో పౌరులందరికీ పౌరసత్వం ఉండేలా ఎన్నార్సీ బిల్లుకి రూపకల్పన చేసింది. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది.

మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెడతారని భావిస్తున్నారు.వివాదాస్పద  పౌరసత్వ బిల్లుపై హోంమంత్రి అమిత్‌ షా గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించారు. ఈబిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పౌరసత్వ బిల్లు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి ఆమోదం లభించింది.

మరోవైపు కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడం ... పౌరసత్వ సవరణ బిల్లూ అంతే ప్రాముఖ్యత కలిగిన అంశాలని కేంద్ర రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ బిల్లును హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ ఎంపీలంతా కచ్చితంగా హాజరు కావాలన్నారు.

పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు సభ ముందుకు రానున్నందున ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని రాజ్ నాథ్ సింగ్ ఎంపీలను ఆదేశించారు. బీజేపీ ఎప్పుడూ దేశ ఐక్యత కోసమే పాటుపడుతుందని, అందులో భాగంగానే చారిత్రాత్మకమయిన పౌరసత్వ సవరణ బిల్లుకి రూపకల్పన చేసిందన్నారు రాజ్ నాథ్ సింగ్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle