newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఓకె.. అసోం, మేఘాలయ, త్రిపురలో ఉద్రిక్తత

13-12-201913-12-2019 08:17:45 IST
Updated On 20-12-2019 11:28:27 ISTUpdated On 20-12-20192019-12-13T02:47:45.613Z13-12-2019 2019-12-13T02:47:35.116Z - 2019-12-20T05:58:27.738Z - 20-12-2019

పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఓకె.. అసోం, మేఘాలయ, త్రిపురలో ఉద్రిక్తత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. డిబ్రూగఢ్‌లో ఆందోళనకారులు సీఎం ఇంటిపై దాడి చేశారు. కర్ఫ్యూను ధిక్కరిస్తూ భారీ సభ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఆరెస్సెస్‌ నేతల ఇళ్ళకు నిప్పుపెట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. అసోం, త్రిపురలో రైళ్లు రద్దు చేశారు అధికారులు. అటు మేఘాలయ, త్రిపురలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. 

అసోంలోని డిబ్రూగఢ్‌లో సీఎం సర్బానంద సోనోవాల్‌ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, పలువురు ఆరెస్సెస్‌ నేతల ఇండ్లు, అసోం డీజీపీ కాన్వాయ్‌పై దాడులు చేశారు.

గువాహటితో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ కొనసాగుతున్నా.. భారీ బహిరంగసభ నిర్వహించారు. రెండు రైల్వేస్టేషన్లకు నిప్పుపెట్టడంతో త్రిపుర, అసోంలో రైళ్లను రద్దుచేశారు. మేఘాలయలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

అసోంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు.మేఘాలయలోనూ రెండురోజులపాటు నిషేధం విధించారు. ఇటు ఈశాన్యానికి విమాన సేవలు రద్దుచేశారు. గువాహటి, డిబ్రూగఢ్‌, టిన్సుకియా, జోరాట్‌ జిల్లాల్లో భారీగా సైన్యం శాంతిభద్రత విధుల్లో పాల్గొంది.

పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ నష్టం కలగదని ప్రధాని, హోంమంత్రి చెబుతున్నా.. నిరసనల హోరు మాత్రం తగ్గడం లేదు. గువాహటి, డిబ్రూగఢ్‌లో బుధవారం నుంచే కర్ఫ్యూ విధించగా.. దీనిని ధిక్కరిస్తూ ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్ భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

గువాహటిలో వేలాది మంది ఆందోళనకారులు టైర్లు కాల్చారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించగా గాయపడినవారిని గువాహటిలోని ఆస్పత్రికి తరలించారు.

అంతేకాకుండా అంబారీ ప్రాంతంలో అసోం గణ పరిషత్‌ పార్టీ ప్రధాన కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేశారు. వీటితోపాటు పలు ప్రాంతాల్లోని ఆరెస్సెస్‌ కార్యాలయాలపై దాడులు జరిగాయి. నిరవధిక కర్ఫ్యూను, జోరాట్‌, గోలాఘట్‌, టిన్సుకియా, చరాయిడెయో పట్టణాల్లో రాత్రిపూట కొనసాగిస్తోంది. 

ఇదిలా ఉండగా త్రిపుర జేఏసీ నేతల బృందం గురువారం హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌ షా హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు.

మేఘాలయ సీఎం సంగ్మా.. అమిత్‌షాతో భేటీని వాయిదా వేసుకున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును కేరళ, పంజాబ్‌లలో అమలు చేయబోమని కేరళ, పంజాబ్‌ సీఎంలు పినరాయి విజయన్‌, అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద , భోపాల్‌లో డెమోక్రాటిక్‌ రైట్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. బిల్లు ప్రతులను దహనం చేశారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle