newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పోర్న్ చిత్రాలు చూసినా నన్నే ఎన్నుకున్నారు.. కర్ణాటక డిప్యూటీ సీఎం

21-09-201921-09-2019 09:36:01 IST
2019-09-21T04:06:01.155Z21-09-2019 2019-09-21T04:05:49.385Z - - 12-04-2021

పోర్న్ చిత్రాలు చూసినా నన్నే ఎన్నుకున్నారు.. కర్ణాటక డిప్యూటీ సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రుల జాబితాలో లక్ష్మణ్ సంగప్ప సవది పేరును ఉటంకించడం సంచలనం కలిగించింది. తాను గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కూడా. కర్నాటకలో ఆధీపత్య కులంగా ఉన్నలింగాయత్ కమ్యూనిటీలో యడియూరప్ప వారసుడిగా బీజేపీ దృష్టిలో ఉన్న సంగప్ప గతంలో కర్ణాటక అసెంబ్లీలో తన మొబైల్‌ ఫోన్‌లో బూతు చిత్రాలను తిలకిస్తూ అడ్డంగా దొరికిపోయారు. 

అప్పట్లో ప్రతిపక్షస్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో బీజేపీ తనపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంది. తాను పార్టీకి చిత్తశుద్దితో, నిజాయితీతో సేవలందిస్తానని తెలిసే ప్రతిపక్షం అప్పట్లో తనను వెంటాడిందని సంగప్ప చెబుతున్నారు. 

ఉత్తర కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయాలన్ని ఏకైక లక్ష్యంతోనే పార్టీ సంగప్పకు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఘటన ఎంతో దురదృష్టకరమైనదని చెబుతూనే ఆ అంశంపై తాజాగా తన వివరణ ఇచ్చారు సంగప్ప.  

"ఉద్దేశపూర్వకంగా నేను అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూడలేదు. ఆ సమయంలో జరిగిన మరొక సంఘటనలో భాగంగా అశ్లీల చిత్రాలను చూడటం జరిగింది. ఏదేమైనా అసెంబ్లీలో నేను అలా చేసి ఉండకూడదు. వెనువెంటనే నేను నా పదవికి రాజీనామా చేసి క్షమాపణ కూడా చెప్పాను. కానీ వెనువెంటనే జరిగిన ఎన్నికల్లో పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో నెగ్గాను కూడా. అంటే నాపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదనే భావిస్తున్నాను. నేను పార్టీకి చేస్తూవచ్చిన మంచి పనులకు కలవరపడిన ప్రతిపక్షమే నన్ను ట్రాప్ చేసిందని భావిస్తున్నాను,'' అన్ని సంగప్ప వివరించారు.

కానీ, యడ్యూరప్ప తదనంతర వారసుడిగా భావిస్తున్న బీజేపీ సంగప్పను శషభిషలు లేకుండా ప్రోత్సహించవచ్చు కానీ, మరొక ఘటనతో ముడిపెడుతూ తాను అశ్లీల చిత్రాలు చూశానని సమర్థించుకోవడం ఏమేరకు సరైంది అనేదే ప్రశ్న.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle