newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

13-08-202013-08-2020 06:41:13 IST
2020-08-13T01:11:13.913Z13-08-2020 2020-08-13T01:11:07.114Z - - 17-04-2021

  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభానికి రెండు రోజుల క్రితం తెర పడింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌తో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు జరిపిన మంతనాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఒక మెట్టు దిగి వచ్చారు. జైసల్మెర్‌ హోటల్‌లో బస చేస్తున్న ఎమ్మెల్యేలతో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. 

దాదాపు నెల రోజుల పాటు రసవత్తరంగా సాగిన గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను మర్చిపోయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించి ముందుకు సాగాలని తన మద్దతుదారులను కోరారు గహ్లోత్‌. ఈ సందర్భంగా అశోక్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ.. ‘గత నెల రోజులుగా జరిగిన పరిణామాలు మనల్ని ఇబ్బందులకు గురి చేశాయి. తిరుగుబాటుదారుల వైఖరితో మనం బాధపడ్డాం. అయితే దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం వారి తప్పులను క్షమించాలన్నారు.

ప్రజాస్వామం కోసం ఇలా చేయక తప్పదు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. దాన్ని కాపాడటమే మన ప్రథమ కర్తవ్యం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసిన మాదిరిగానే రాజస్తాన్‌లో మన ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ మనం అలా జరగనివ్వలేదు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాం. ప్రజాస్వామ్యం కోసం మనం ఐక్యంగా ఉండాలి’ అని తన వర్గం ఎమ్మెల్యేలను కోరారు గహ్లోత్‌. 

తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అనంతరం అలక వీడారు. తిరుగుబాటుకు కారణం తెలిపారు. అశోక్‌ గహ్లోత్‌ తనను పనికిమాలిన వ్యక్తి అంటూ పరుష పదజాలంతో విమర్శించారని.. ఆయన ప్రవర్తన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అందుకే తిరుగుబాటు చేశానని తెలిపారు. 

అయితే తిరుగుబాటు నేతలను పార్టీలోకి తీసుకోవడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్ష విధించకుండా వారిని పార్టీలోకి తీసుకోవద్దని కోరుతున్నారు. వారికి పదవులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అధిష్టానం వారిని క్షమించిందని.. మనం కూడా తప్పులను మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని అశోక్‌ గహ్లోత్‌ వారికి తెలిపారు.

రాజస్థాన్ సంక్షోభం కొలిక్కివస్తున్న సూచనలు కనబడుతున్న నేపథ్యంలో పైలట్ మద్దతుదారు భన్వరీలాల్ శర్మ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్‌ నేతనేనని స్పష్టం చేశారు. 

‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్‌, గహ్లోత్‌ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

ఇన్ని రోజుల పాటు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ముఖ్యమంత్రి గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ గురువారం ఒకరినొకరు కలుసుకోనున్నారు. గురువారం జరగబోయే శాసన సభా పక్ష సమావేశం ఇందుకు వేదిక కానుంది. ఈ నెల 14 న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే సచిన్ పైలట్ సొంత గూటికి వచ్చినా... సరే సీఎం గెహ్లోత్ బలపరీక్షకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఎక్కువ కాలం ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచడం సాధ్యమయ్యే పని కాదని, తుది నిర్ణయం మాత్రం ఈ నెల 14న తీసుకుంటారని సమాచారం. 19 మంది రెబెల్స్ తో కలిపితే.. కాంగ్రెస్ కు 200 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు లెక్క.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle