పెరుగుతున్న జనాభా రెండో స్టేజిలోని కేన్సర్‌తో సమానం: కేంద్రమంత్రి హెచ్చరిక
28-09-201928-09-2019 11:24:25 IST
2019-09-28T05:54:25.036Z28-09-2019 2019-09-28T05:54:22.964Z - - 14-04-2021

భారతదేశంలో పెరుగుతున్న జనాభా విస్పోటనం సెకండ్ స్టేజ్‌కు చేరిన కేన్సర్ లాంటిదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. జనాభాను నియంత్రించడానికి కఠినాతికఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిందేనన్నారు. అవసరమైతే వోటింగ్ హక్కులను కూడా తీసేయాలన్నారు. జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తున్నవారు మతాన్ని చర్చకు పెడుతున్నారని విమర్శించారు. పెరుగుతున్న జనాభా రెండో దశకు చేరుకున్న కేన్సర్‌లా మారింది. దీన్ని మనం నియంత్రించకపోతే త్వరలోనే ఈ వ్యాధి ప్రాణాంతకమైన నాలుగో దేశకు చేరుకుంటుందని మంత్రి చెప్పారు. భారత ఆర్థిక వృద్ధిని వెనక్కు నెడుతున్న జనాభా పెరుగుదలను నియంత్రించడానికి తగు చర్యలు చేపట్టాలని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభా నియంత్రణకు చైనా తీసుకున్న కఠిన చర్యలను భారత్ కూడా చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. కుటుంబాన్ని నిర్వహించడం కూడా దేశభక్తిలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణకోసం చట్టాన్ని తీసుకురావడానికి ప్రజా ఉద్యమం అవసరం. అక్టోబర్ 11-13 తేదీల్లో మీరట్ నుంచి ఢిల్లీ వరకు జరపబోతున్న ప్రజాచైతన్య యాత్రలో తాను కూడా స్వయంగా పాల్గొనబోతున్నానని మంత్రి చెప్పారు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
36 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా