newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెద్దల సభ ప్రతిష్ట మసకబారింది..!

23-09-202023-09-2020 16:10:21 IST
2020-09-23T10:40:21.440Z23-09-2020 2020-09-23T10:39:57.677Z - - 12-04-2021

పెద్దల సభ ప్రతిష్ట మసకబారింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆగ్రో బిల్లు ఆమోదం సందర్భంగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద సభ ప్రతిష్టను మసకబార్చాయి. రాజ్యసభకు మేధావులను,నిపుణులను,నిష్ణాతులను, పంపాలన్న ఉన్నతాశయానికి పార్టీలు తూట్లు పొడుస్తున్న ఫలితమే...రాజ్యసభలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలని చెప్పవచ్చు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి పోడియం వద్ద మోహరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు, అరుపులు, కేకలతో సభా గౌరవాన్ని మంటగలపడం వంటి పనులకు సభ్యులు పాల్పడుతున్నారు.

పార్టీలు రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో రాజకీయ కారణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో పెద్దల సభకు ఎన్నికయ్యే వారు ఫక్తే రాజకీయ నాయకులే అవుతున్నారు. దీంతో అక్కడ పార్టీ రాజకీయాలే తాండవిస్తున్నాయి. ప్రజాసమస్యలు. దేశ శ్రేయస్సు వంటి అంశాలపై పెద్దగా పట్టింపు లేని వారి సంఖ్యే పెద్దల సభలో అధికంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగానే  రాజ్యసభలో పెద్దలు హుందాగా ప్రవర్తించడంలో విఫలం అవుతున్నారు. చర్చల ద్వారా ప్రజా సమస్యల ప్రస్తావన ఊసే ఉండటం లేదు.

ఎంత సేపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి లబ్ది పొందాలన్న తపన విపక్ష సభ్యులలోనూ, విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవసరమైన బిల్లలను ఎలా పాస్ చేయించుకోవాలన్న యావ అధికార పక్ష సభ్యులలోనూ కనిపిస్తున్నది. అగ్రి బిల్లుల సందర్భంగా పెద్దల సభలో జరిగిన సంఘటనలు కచ్చితంగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతాయి.

రాజ్యసభ పరువు పోయేలా, పెద్దల సభ గౌరవం మంటగలిసేలా జరిగిన సంఘటనలు అందరినీ గిబ్భ్రాంతికి గురి చేశాయనడంలో సందేహం లేదు. ఛైర్మన్‌ సీటులో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై కాగితాలు చింపేసి, ఆయనపై దాడిచేసినంత పని చేశారు. నిజానికి ఇలాంటి సందర్భం వచ్చిప్పుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు.

ఇకపోతే బిల్లులోని వివాదాస్పదమైన రెండు అంశాలపై ఓటింగ్‌ నిర్వహించడానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ నిరాకరించారు. సభ్యుల నుండి పదే పదే డిమాండ్‌ వస్తున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. నిష్పాక్షికంగా వ్యవహరించడంలో ఆయన సముచిత రీతిలో వ్యవహరించలేదన్నది విపక్షాల ఆరోపణ. అలాగే అధికార పక్ష సభ్యులు కూడా విపక్షాలను విశ్వాసంలోనికి తీసుకోకుండా, అగ్రో బిల్లులపై విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరించడం వల్లే పెద్దల సభలో అటువంటి పరిస్థితి ఎదురైందన్నది వాస్తవం.

ఏదో విధంగా విపక్షాల గొంతు నొక్కి తమకు అనుకూలంగా సభను నిర్వహించుకోవడానికి అధికార పక్షం చేసిన ప్రయత్నమే రాజ్యసభలో అవాంఛనీయ సంఘటలను జరగడానికి కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. నిజానికి ప్ర భుత్వం కూడా ఈ బిల్లుపై సమగ్ర చర్చకు అంగీకరించి ఉండాల్సింది. చట్ట సభలను, చట్టసభలలో విపక్ష సభ్యులను విశ్వాసంలోనికి తీసుకోకుండా, ప్రధాని మోడీ సైతం బిల్లు వల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలివీ అంటూ సభ జరుగుతున్న సమయంలో సభ బయట వివరణలు ఇవ్వడం ఎంతైనా అభ్యంతరకరం. ప్రభుత్వం వ్వవహరిస్తున్న ఈ తీరు వల్లే పెద్దల సభలో జరిగిన సంఘటన అని చెప్పవచ్చు. ఇటుంవంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే...ప్రభుత్వం సభా నిర్వహణలో హుందాగా వ్యవహరించాలి. సభ ముందుకు వచ్చిన ప్రతి అంశంపైనా సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వాలి.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle