newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెద్దల సభకు పోటెత్తనున్న యువరక్తం..

04-03-202004-03-2020 09:15:45 IST
Updated On 04-03-2020 12:31:17 ISTUpdated On 04-03-20202020-03-04T03:45:45.698Z04-03-2020 2020-03-04T03:45:43.507Z - 2020-03-04T07:01:17.507Z - 04-03-2020

పెద్దల సభకు పోటెత్తనున్న యువరక్తం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభకు మార్చి 24న జరగనున్న తాజా ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలనుంచి యువరక్తం పోటెత్తే సూచనలు కనబడుతుండగా పదవీవిరమణ చేయనున్న చాలామంది సీనియర్ల రాజకీయ జీవితం దాదాపుగా ముగియనుంది. కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్, ఎన్సీపీ, శివసేన, ఏడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నుంచి కురువృద్ధులు చాలామంది మార్చి 24 తర్వాత రాజకీయ జీవితం నుంచి తెరమరుగు కానున్నారు. వీరి స్థానంలో అన్ని రాజకీయ పక్షాల్లోంచి యువతరం ముందుకొచ్చి కీలకస్థానాలను చేజిక్కించుకోనుంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, మిళింద్ దేవ్‌రా తాజాగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు మోతీలాల్ఓరా, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, మహ్మద్ ఖాన్, కుమారి సెల్జా, పవన్ కుమార్ బన్సల్, కరణ్ శుక్లా  వంటి కాంగ్రెస్ వృద్దనేతలకు ఇక ఏ ఎన్నికల్లోనూ అవకాశం ఉండకపోవచ్చు. 

ఇక బీజేపీ నుంచి రామ్ మాధవ్, మురళీధర్ రావు, అలోక్ కుమార్ వంటి యువనేతలకు ఈ దఫా పెద్దల సభలో పట్టం కడుతున్నారు. ఇక జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆయా రాష్ట్రాలవారీగా రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోనున్న వారి జాబితా చూద్దాం

మహారాష్ట్ర: దలవాయి, హుసేన్ ఉమర్ సబ్లే, అమర్ శంకర్, ధూత్, రాజ్‌కుమా్ర్ నంద్ లాల్ పవార్, శరత్ చంద్ర గోవిందరావు, మెమోన్ అబ్దుల్ మజీద్ హాజీ అహ్మద్, అతవాలే, రామదాస్ బండు, కకాడే, సంజయ్ దత్తాత్రేయ

ఒడిశా: అనుభవ్ మొహంతి, నరేంద్ర కుమార్ స్వెయిన్, సరోజిని హెంబ్రమ్, రణజీబ్ బిస్వాల్

తమిళనాడు: శశికళ పుష్ప, కె.సెల్వరాజ్, తిరుచ్చి శివ, ఎస్ ముత్తుకరుప్పన్, రంగరాజన్, విజిలా సత్యనాథ్, 

పశ్చిమబెంగాల్: రింతభరా బెనర్జీ, జోగేంద్రనాథ్ చౌదరి, డాక్టర్ కన్వర్ దీప్ సింగ్, మనిష్ గుప్తా, అహ్మద్ హసన్, 

ఆంధ్రప్రదేశ్: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, కె. కేశవరావు

తెలంగాణ: కేవీపీ రామచంద్రరావు, గరికిపాటి మోహనరావు

అస్సాం: భుబనేశ్వర్ కలితా, డాక్టర్ సంజయ్ సిన్హ్, బిశ్వజిత్ డైమరి

బీహార్: కక్షణ్ పర్వీన్, రవీంద్ర కిషోర్ సిన్హా, రామ్ నాథ్ ఠాకూర్, హరివంశ్ నారాయణ సింగ్, సీపీ ఠాకూర్.

చత్తీస్‌గర్: రన్‌విజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్, మోతీలాల్ వోరా, 

గుజరాత్: గోహెల్ ఛునిబాయ్ కంజిబాయి, మిస్త్రీ మధుసూధన్ దేవ్రామ్, వడోదయ లాల్ సింగ్ ఉద్ సిన్హ్, తుండియ శంభుప్రసాద్ బల్దవ్ దాస్ జీ,

హర్యానా: రామ్ కుమార్, కుమారి సెల్జా

హిమాచల్ ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్, 

జార్ఖండ్: నత్వాని పరిమళ్, ప్రేమ్ చంద్ గుప్తా

మధ్యప్రదేశ్: ప్రభాత్, సత్యనారాయణ్ జతియా

మణిపూర్: క్షేత్రిమయుమ్ భబానంద సింగ్

రాజస్తాన్: నారాయణ్ లాల్ పంచారియా, రామ్ నారాయణ్ దూడి, విజయ్ గోయెల్,

మేఘాలయ: వంశుక్ సీయమ్

పైన పేర్కొన్న రాజ్యసభ సభ్యులంతా ఏప్రిల్ 2 నుంచి 12 వతేదీలోపు తమ సభ్యత్వాలు కోల్పోనున్నారు. వీరిస్తానాల్లో అన్ని పార్టీలనుంచి దాదాపుగా యువతరమే తాజాగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

కాగా, రాజ్యసభ ఎన్నికలకు గాను మార్చి 6వ నోటిఫికేషన్, 13న నామినేషన్లకు చివరి తేదీ, 16న నామినేషన్ల స్క్రూటినీ, 18న అభ్యర్థుల ఉపసంహరణ చివరితేదీ, 26 మార్చి 2020న పోలింగ్, కౌంటింగ్ మార్చి 26, ఎన్నికల ప్రక్రియ ముగింపు మార్చి 30.

 

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   39 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   11 minutes ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   5 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle