newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

'పీకే' ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకోస్తావా?

26-09-201926-09-2019 13:16:14 IST
Updated On 27-09-2019 16:33:54 ISTUpdated On 27-09-20192019-09-26T07:46:14.196Z26-09-2019 2019-09-26T07:46:10.611Z - 2019-09-27T11:03:54.603Z - 27-09-2019

'పీకే' ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకోస్తావా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పీకే అనబడే ప్రశాంత్ కిషోర్ కోసం ఇప్పుడు తమిళనాట పోటీ నెలకొందా? అటు కమల్.. ఇటు రజనీ ఇద్దరికీ పీకే సేవలు కావాలా? మరి పీకే ఎవరివైపు మొగ్గుచూపుతారు? రజనీ పీకేని కలిసి తన ప్రపోజల్ చెప్పేశారా? అంటే తమిళనాట అవుననే సమాధానం వినిపిస్తుంది. ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ' క్లుప్తంగా చెప్పాలంటే (ఐ-ప్యాక్).. ఇదీ ప్రశాంత్ కిషోర్ యాక్షన్ టీమ్. నరేంద్ర మోడీని రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిని చేసిన దగ్గర నుండి ఆ నరేంద్రుడిని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టి ఈమధ్యనే ఏపీలో జగనుడికి భారీ విజయాన్ని అందించడంలో పీకే హస్తం ఉంది. 

నేతలకు వ్యూహాల నుంచి పార్టీలకు ప్రచారం.. అధినాయకత్వాన్ని పార్టీ శ్రేణులకు చేరువచేసే ఎత్తులు.. ప్రత్యర్థుల చిక్కుల నుండి తప్పించి ముందుకు నడిపించే వ్యూహాలను సిద్ధం చేసి పక్కా ప్రణాళికతో ఆది నుంచి సరైన వ్యూహాన్ని అమలుచేసి అనుకున్న లక్ష్యాన్ని కొట్టేయడం పీకే స్టైల్. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలనాడిని పట్టుకోవడం దగ్గర నుండి సోషల్ మీడియాలో ఓ వైబ్రేషన్ క్రియేట్ చేయడం వరకు ఈ ఐ ప్యాక్ టీమ్ క్రియాశీలకంగా పనిచేసి పార్టీలను విజయతీరాలకు చేర్చడంలో ఆరితేరిపోయింది. 

అందుకే ఇప్పుడు పీకే కోసం తమిళనాట పోటీనెలకొన్నట్లుగా తెలుస్తుంది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా దేశవ్యాప్తంగా అందరిచూపు ఆ ఎన్నికలపై పడింది. అక్కడ ఇప్పుడు రెండు భారీ కటౌట్లు కత్తులుకట్టి ఎన్నికల పందేనికి దిగుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలోనే ట్రయిల్ రన్ షురూ చేయగా తలైవా మాత్రం ఈ ఎన్నికలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 

నిజానికి ఈ బాషా ఎంట్రీ కోసం అయన అభిమానులు రెండు దశాబ్దాలకు పైగానే ఎదురుచూస్తున్నా ఇన్నాళ్లు కర్రవిరగదు పాముచావదు అన్న చందంగా నెట్టుకొచ్చారు. గత ఏడాదిదే తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చి కోటికి పైగా సభ్యత్వాలను చేయాలనీ సంఘాలను ఆదేశించి అభిమాన సంఘాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశాలు జరిగిపోయాయి. 

పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ సైలెంట్ అయిపోయిన రజనీ ఇక ఈ ఎన్నికలకు మాత్రం రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా అక్కడ రాజకీయ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే ఈమధ్యనే హోంమంత్రి అమిత్ షా చేసిన హిందీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రజనీ రెండు రోజుల క్రితం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లుగా ప్రచారం ఊపందుకుంది. 

రజనీ ప్రజాసంఘాలు కూడా పీకేతో తలైవా భేటీని ధృవీకరించాయి. తమిళనాట రాజకీయ పరిస్థితులపై పీకే అండ్ కో చేసిన సర్వేల పరిసితులపై ఈ సమావేశం జరిగినట్లుగా సంఘాల అధ్యక్షులు ఇచ్చిన సమాచారం. అయితే ఇప్పుడు ఆసక్తిగా మారిన అంశం ఏమిటంటే పీకే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ మక్కల్ నీది మైమ్ కోసం పనిచేశాడని రాజకీయ వర్గాలలో వినిపించింది. 

కమల్ ఎన్నికల కోసమే పీకేను ఆశ్రయించాడా? అసెంబ్లీ ఎన్నికలలో పీకే సేవలు వదులుకుంటాడా? ఇప్పుడు రజనీ కూడా పీకే కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. మరి పీకే ఈ గట్టునుంటాడా? ఆ గట్టుకొస్తాడా? ఎవరివైపు వస్తాడు? లేక తన వ్యూహాలతో ఇద్దరినీ కలిపి సంచలనం అవుతారా? అన్నది పొలిటికల్ స్రీన్ మీదే చూడాల్సి ఉంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle