newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా విరాళాలా.. కాంగ్రెస్ ఎదురుదాడి

30-06-202030-06-2020 13:32:53 IST
Updated On 30-06-2020 17:16:21 ISTUpdated On 30-06-20202020-06-30T08:02:53.542Z30-06-2020 2020-06-30T08:02:50.390Z - 2020-06-30T11:46:21.049Z - 30-06-2020

పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా విరాళాలా.. కాంగ్రెస్ ఎదురుదాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ మన్‌ కీ బాత్‌లో చెప్పిన కాసేపటికే సింఘ్వీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18సార్లు సమావేశమైన మోదీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుగా మోదీ అంగీకరించి తీరాలన్నారు. పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. పీఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్‌ రూ. 30 కోట్లు, పేటీఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ ఆరోపించారు.

గడచిన ఆరేళ్లలో చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ 18సార్లు సమావేశమయ్యారు. ఆందోళన కలిగించే అంశమేమిటంటే.. ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటున్న పీఎం కేర్స్‌ నిధికి, చైనా నుంచి రూ. వందల కోట్ల విరాళాలు వచ్చాయి. గత నెల 20 నాటికి పీఎం కేర్స్‌లో రూ. 9678 కోట్ల నిధులుండగా.. హువావే నుంచి రూ. 7కోట్లు, టిక్‌టాక్‌ నుంచి రూ. 30 కోట్లు, పేటీఎం నుంచి రూ. 100కోట్లు, షామీ నుంచి రూ. 15కోట్లు, ఒప్పో నుంచి రూ.కోటి వచ్చాయి. ఓవైపు చైనా దళాలు మన భూభాగాల్ని ఆక్రమిస్తుంటే.. మరోవైపు ప్రధాని ఆ దేశ సంస్థల నుంచి నిధుల్ని తీసుకోవడం బాధాకరం. 

తన పదవిని దుర్వినియోగపరిచి, ఆ విరాళాలను అంగీకరించిన మోదీ, దేశాన్ని చైనా దురాక్రమణ నుంచి ఎలా రక్షిస్తారు..? అసలు ఆ దేశాన్ని దురాక్రమణదారుగా ఆయన ఎందుకు ప్రకటించడం లేదు? 2007 నుంచీ బీజేపీకి చైనా కమ్యూనిస్టు పార్టీతో(సీపీసీ) సంబంధాలున్నాయి. గత 13ఏళ్లలో ఆ పార్టీ అధ్యక్షులు చైనాతో సంబంధాలు నెరపినంతగా, భారతదేశ చరిత్రలోని ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు నెరపలేదు. 2007 జనవరి, 2008 అక్టోబరుల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌, 2011 జనవరిలో గడ్కరీ, 2014లో అమిత్‌ షా సీపీసీతో సంప్రదింపులు జరిపారు. 

ఆ పార్టీకి(బీజేపీ) దేశ భద్రత గురించి లెక్కలేదు. అయితే తమ గురించి లేదా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. పీఎం కేర్స్‌ నుంచి నిధులు భారీగా దారి మళ్లుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదు. కాగ్‌తో సహా ఏ ప్రభుత్వ సంస్థ కూడా దాన్ని విచారించేందుకు లేదు. మోదీ సొంతంగా నడుపుతున్న నిధిలా పీఎం కేర్స్‌ వ్యవస్థ నడుస్తోంది. ఈ ఆరోపణలిన్నింటికీ మోదీ సమాధానం చెప్పగలరా?’’ అని సింఘ్వీ నిలదీశారు. 

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)తో బీజేపీకి ఎప్పట్నుంచో సత్సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. 2007 నుంచి బీజేపీ ఈ బంధాలను కొనసాగిస్తోందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, అమిత్‌ షా చైనాతో మంచి సంబంధాలు ఉన్నావారేనని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో 13 ఏళ్లుగా సత్సంబంధాలున్న రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదని నిందించారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   4 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle