పాలన ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
25-11-201925-11-2019 13:50:21 IST
Updated On 25-11-2019 13:53:23 ISTUpdated On 25-11-20192019-11-25T08:20:21.568Z25-11-2019 2019-11-25T08:12:22.627Z - 2019-11-25T08:23:23.810Z - 25-11-2019

ఒకవైపు మహారాష్ట్ర రాజకీయాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మహారాష్ట్ర సీఎం మాత్రం తనకేం పట్టదన్నట్టు తన పని తాను కానిచ్చేస్తున్నారు. పాలన ప్రారంభించేశారు సీఎం ఫడ్నవీస్. సోమవారం మంత్రాలయకు వచ్చిన సీఎం తొలి సంతకం చేశారు. సీఎంఆర్ఎఫ్ కి సంబంధించి ఆయన చెక్కుపై సంతకం చేశారు. బాధితురాలు కుసుమ్ వెంగర్లేకర్ కి చెక్ అందించారు. ఈమేరకు సీఎంవో ఫోటోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది.
ఫడ్నవీస్ బలపరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో సోమవారం వాడివేడి వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీజేపీ కావాలని జాప్యం చేస్తోందని, వెంటనే బలనిరూపణ జరిగేలా ఆదేశాలివ్వాలని కోర్టుని కోరింది.
శాసనసభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని కపిల్ సిబల్ నిలదీశారు. తెల్లవారుజామున అంత హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని ఆయన ప్రశ్నించారు. హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని ఆయన అన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ సెక్రటేరియట్ కు రావడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ఎలా స్పందిస్తాయో చూాడాలి.



జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
7 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
14 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
14 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
17 hours ago
ఇంకా