పార్లమెంటులో ఒంటరైన బీజేపీ.. వ్యవసాయ బిల్లుకు చుక్కెదురేనా?
17-09-202017-09-2020 12:56:07 IST
2020-09-17T07:26:07.085Z17-09-2020 2020-09-17T07:26:04.045Z - - 14-04-2021

ప్రధాని నరేంద్రమోదీ రెండోదఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి కేంద్రప్రభుత్వానికి మిత్రపక్షాలు ఝలక్ ఇవ్వబోతున్నాయా? అంటే నిజమేనని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం శిరోమణీ అకాలిదళ్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఆయా బిల్లులకు పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ పార్టీ విప్ జారీచేసింది. ప్రస్తుత సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బిల్లులను అడ్డుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అధికార బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు కరోనా వైరస్ కంటే ఘోరమైనవని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ పేర్కొన్నారు. రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యవసాయ కూలీలపై ఇది తీవ్ర ప్రభావం వేస్తుందని హెచ్చరించారు. పార్లమెంటులో ఈ బిల్లులకు మద్దతు తెలిపే ఎంపీలను తమ గ్రామాల్లోకి ఇక అనుమతించబోమని, అలాంటి ఎంపీలకు తాము పెద్ద గుణపాఠం చెబుతామని హరీందర్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు మొదట్లో తన మద్దతు తెలిపిన మిత్రపక్షం అకాలీదళ్, ఈ బిల్లులపై తమను ఏమాత్రం సంప్రదించలేదని ఇప్పుడు అడ్డం తిరిగింది. ఈ అంశంలో రైతుల భయాందోళనలను తొలగించకుండా కేంద్రప్రభుత్వం ఈ మూడు ఆర్డినెన్స్‌లను పార్లమెంట్ ఆమోదానికి సమర్పించవద్దని అకాలీదళ్ హెచ్చరించింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్ మూడు ఆర్డినెన్స్‌లను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టారు. వీటికి సంబంధించిన బిల్లులను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కేంద్రం భావించింది. నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే కేంద్రం ప్రతిపాదిత బిల్లులపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన నిర్వహించారు. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అకాలిదళ్ ఎంపీలకు విప్ జారీచేసింది. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాలని అకాలిదళ్ నిర్ణయించింది. మరోవైపు ఉత్తర భారతంలో మొదలైన రైతు మద్దతు ఉద్యమం త్వరలోనే దక్షిణాదికి కూడా విస్తరిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా పంజాబ్‌లో ఎన్నో ఏళ్లుగా బీజేపీ-అకాలిదళ్ భాగస్వామ్యంగా ఉన్న విషయం తెలిసిందే. మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఈ విషయమై తన అభిప్రాయం చెబుతూ ఇంత ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేటప్పుడు కనీసం మిత్ర పక్షాలను కూడా సంప్రదించరా అని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మా మంత్రి హర్ సిమ్రాట్ కౌర్ బాదల్ తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని బాదల్ చెప్పారు.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago

మమత ప్రచారంపై 24 గంటల బ్యాన్. ఈసీ కొరడా..
13-04-2021
ఇంకా