newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పార్టీ ప్రక్షాళనా? గాంధీ కుటుంబం ఆధిపత్యమా?

12-09-202012-09-2020 14:14:22 IST
2020-09-12T08:44:22.463Z12-09-2020 2020-09-12T08:44:18.567Z - - 14-04-2021

పార్టీ ప్రక్షాళనా? గాంధీ కుటుంబం ఆధిపత్యమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉరుములేని పిడుగులా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రక్షాళన పేరుతో తీసుకున్న చర్యలు ఎవరికీ ఆశ్చర్యం కలిగించవు. ధిక్కారాన్ని సహించడమన్నది కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదు. గాంధీ నెహ్రూ కుటుంబాన్ని ధిక్కరిస్తే పార్టీలో ప్రాధాన్యత ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రక్షాళన పేరుతో  కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన వర్కింగ్‌ కమిటీని పునర్‌వ్యవస్థీకరించడంలో జరిగింది కూడా అదే. అసమ్మతి గళాన్ని అణచివేయడమే లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం జరిగింది. 

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో కూనారిల్లిన కాంగ్రెస్ కు పార్టీలో అసమ్మతి రాగం పెద్ద తలపోటుగా పరిణమించిందనడంలో సందేహం లేదు. అయినా జయాపజయాలకు అతీతంగా కాంగ్రెస్ లో గాంధీనెహ్రూ కుటుంబానిది తిరుగులేని అధిపత్యం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లో గాంధీ నెహ్రు కుటుంబంపై విమర్శలు చేసిన ఏ నాయకుడినీ పార్టీ అధిష్టానం ఉపేక్షించదు.

ఇఫ్పుడు సోనియా గాంధీ పార్టీ ప్రక్షాళన పేరుతో తీసుకున్న చర్యలు ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాయంతే. గులాం నబీ ఆజాద్ సహా అటువంటి సీనియర్ నాయకులు ఇటీవల సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో రాసిన బహిరంగ లేఖ పార్టీలో కలకలం రేపింది. పార్టీలో గాంధీనెహ్రూ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ రాసిన ఆ లేఖ అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. లేఖ రాసిన 24 గంటలలోనే అందుకు బాధ్యులైన నేతలు యూటర్న్ చందంగా విధేయతను ప్రకటించినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. లేఖ పర్యవశానంగా అందుకు బాధ్యులైన వారికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.

సీనియర్లను పక్కన పెట్టి యువతకు పెద్ద పేట పేరుతో రాహుల్ కు సన్నిహితులుగా పేరు పడిన వారిని అందలాన్ని అందించిన చందంగా ఈ ప్రక్షాళన ద్వారా రాహుల్  పగ్గాలు చేపట్టడం ఖాయమన్న సంకేతాలనూ ఇచ్చింది. కాంగ్రెస్ పూర్వవైభవం సంతరించుకోవాలంటే..పార్టీ పగ్గాలు గాంధీ నెహ్రూకుటుంబం చేతిలోనే ఉండాలని పార్టీ శ్రేణుల్లో అత్యధికులు భావిస్తుంటారనడంలో సందేహం లేదు.

అందుకే పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు రాసిన లేఖ పర్యవసానంగా పార్టీలో వారి ప్రాధాన్యం తగ్గింది. ఎదరిస్తే విూ సంగతి ఇంతే అని తేల్చేశారు. దీనికితోడు మళ్లీ రాహుల్‌ పగ్గాలు చేపడతారన్న సంకేతాల మేరకు పాతవారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైందని ఈ చర్య ద్వారా స్పష్టంగా అవగతమౌతోంది. మొత్తంగా శుక్రవారం చేపట్టిన మార్పులు పార్టీలో భవిష్యత్‌ పరిణామాలకు నాంది అని భావించవచ్చు. 

పార్టీని సంస్థాగత ప్రక్షాళన చేయాలని, పూర్తిస్థాయి నాయకుడిని  ఎన్నుకోవాలంటూ... ఇటీవల సీనియర్లు రాసిన లేఖ వివాదం ముగిసిన కొద్ది రోజులలోనూ పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన హైకమాండ్ అసమ్మతి గళానికి నేతృత్వం వహించిన ఆజాద్‌కు పదవుల్లో కోత విధించింది.  ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. ఒక్కడిపైనే చర్యలు తీసుకోకుండా మరి కొందరిపైనా చర్యలు తీసుకుంది. మొత్తానికి పార్టీలో యువరక్తం ఎక్కించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు  ఫలవంతమౌతాయనేది రానున్న కాలమే చెబుతుంది. 

పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి  సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ సహా 22 మంది సభ్యులు ఉండనున్నారు. 26 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో పార్టీ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జిగా ప్రియాంక గాంధీ కొనసాగనున్నారు. పార్టీలో సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాకు   కాంగ్రెస్‌ అధినేత్రికి సలహా ఇచ్చే ఆరుగురు సభ్యుల   చోటు దక్కింది. ఈ ప్రక్షాళనలో సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. సీడబ్ల్యూసీలో ఆయన్ను కొనసాగించినప్పటికీ.. హరియాణా ఇన్‌ఛార్జిగా ఆయన స్థానంలో వివేక్ బన్సల్‌ను నియమించారు. ఆజాద్‌తో పాటు అంబికా సోనీ, వెూతీలాల్‌ ఓరా, మల్లిఖార్జున ఖర్గేలను సైతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle