newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్న రూల్స్

30-04-201930-04-2019 08:42:01 IST
Updated On 03-07-2019 11:44:31 ISTUpdated On 03-07-20192019-04-30T03:12:01.587Z30-04-2019 2019-04-30T03:11:37.017Z - 2019-07-03T06:14:31.399Z - 03-07-2019

పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్న రూల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలోని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల‌కు గుబులు పుట్టిస్తున్నాయ‌ట‌. 1990 నుంచీ ఈ ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం బాగా ఎక్కువైన‌ట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ద‌గ్గర రిజిస్టర్ అయిన పార్టీలు దాదాపు 2301 ఉన్నాయి. వీటిలో చాలా పార్టీల పేర్లు విచిత్రంగా ఉన్నాయ‌ట‌. భ‌రోసా పార్టీ, స‌బ్ సే బ‌డీ పార్టీ, రాష్ట్రీయ సాఫ్ నీతి పార్టీలు జ‌నాన్ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు పాట్లు ప‌డుతున్నాయి. 

వీటి సంగ‌తి ఎలా ఉన్నా ఇప్పటి వ‌ర‌కూ దేశంలో జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందింది కేవ‌లం 7 పార్టీలు మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, టీఎంసీ పార్టీలకు మాత్రమే ఇప్పుడు జాతీయ పార్టీ హోదా ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 52 పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. అంటే ఈ ఎన్నిక‌ల్లో 7 జాతీయ‌, 52 రాష్ట్రీయ పార్టీలు దేశ రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నాయి. ఓ పార్టీకి జాతీయ హోదా గుర్తింపు అంత సులువుగా రాద‌ట‌. ఎవ‌రికి వారు త‌మ‌ది జాతీయ పార్టీగా ప్రక‌టించుకున్నా అది పేరుకి మాత్రమే కానీ, అధికారికంగా ఎన్నిక‌ల సంఘం గుర్తింపు ఉండ‌దు. 

ఎందుకంటే జాతీయ పార్టీలుగా గుర్తింపు రావాలంటే నాలుగు నిబంధ‌న‌లు ఉన్నాయి. లోక్ స‌భ సీట్లలో క‌నీసం 2 శాతం సీట్లు గెల్చుకోవాలి. అంటే క‌నీసం 11 ఎంపీ సీట్లలో గెల‌వాలి. దేశంలోని ఏవైనా మూడు రాష్ట్రాల‌ 

నుంచైనా పోటీ చేసి ఈ సీట్లు గెల‌వాలి. అలాగే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో క‌నీసం నాలుగు రాష్ట్రాల్లో క‌నీసం ఆరు శాతం ఓటింగ్ తెచ్చుకోగ‌ల‌గాలి. ఇలా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ఆరు శాతం ఓటింగ్ రాబ‌ట్టుకోవాలి. ఏ పార్టీకైనా రాష్ట్ర పార్టీ హోదా వ‌చ్చిన త‌ర్వాతే జాతీయ పార్టీ గుర్తింపు వ‌స్తుంది. ఇలా క‌నీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీ హోదాకు ఎంపిక అవుతుంది. 

ఈ మూడు నిబంధ‌న‌ల‌లో ఏ ఒక్కటి ఉన్నా, ఆ పార్టీకి జాతీయపార్టీ హోదా వ‌స్తుంది. 2016లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా ద‌క్కింది. ఎందుకంటే ప‌శ్చిమ బెంగాల్, మ‌ణిపూర్, త్రిపుర‌, అరుణాచ‌ల్ప్రదేశ్ రాష్ట్రాల్లో, ఆ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో టీఎంసీకి జాతీయ పార్టీ హోదా వ‌చ్చింది. అలాగే అంతకుముందు 2001లో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా ద‌క్కింది.

ఎందుకంటే మ‌ధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర‌ప్రదేశ్, జ‌మ్ము అండ్ క‌శ్మీర్ రాష్ట్రాల్లో బీఎస్పీ, రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. అప్పటి ఎన్నిక‌ల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓటింగ్ సంపాదించిన బీఎస్పీ, రాష్ట్ర పార్టీగా నిలిచింది. దీంతో జాతీయ పార్టీ హోదా ద‌క్కించుకుంది. ఇక 2010లో రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ పార్టీ జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. అదే విధంగా సీపీఎం, సీపీఐ, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీలు, 2014 ఎన్నిక‌ల దెబ్బకు జాతీయ పార్టీ హోదా కోల్పోయాయి. 

అయితే ప‌దేళ్లలో తాము పూర్వ వైభ‌వం తెచ్చుకుంటామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లిఖిత పూర‌కంగా విన్నవించుకోవ‌డంతో 2016లో అవ‌కాశం ఇచ్చింది ఈసీ. ఇక దేశంలోని 29 రాష్ట్రాల్లో 52 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. వీటిలో శివ‌సేన‌, జేడీఎస్, ఆప్, టీడీపీ, జేడీయూ, ఏఐడీఎంకే, బీజేడీ, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, నేష‌న‌లిస్ట్ పీపుల్స్ పార్టీ, నేష‌న‌లిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలు ఇప్పుడు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రావాల‌న్నా కేంద్ర ఎన్నిక‌ల సంఘ నిబంధ‌న‌లకు లోబ‌డి ఉండాలి. 

ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నీసం మూడు శాతం ఓటింగ్ రావాలి. ఇక ఆ రాష్ట్రంలో 25 లోక్ స‌భ సీట్లు ఉంటే అందులో ఒక్క సీటులో అయినా గెల‌వాలి. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక‌ల్లో సీట్లు గెల‌వ‌లేక పోయినా, కనీసం ఆరు శాతం ఓటింగ్ వ‌స్తే రాష్ట్ర పార్టీ గుర్తింపు వ‌స్తుంది.

మ‌రో విష‌యం ఏంటంటే, జాతీయ పార్టీల్లో కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కే ఆలిండియా రేడియో, దూర‌ద‌ర్శన్ చాన‌ళ్లలో ప్రచారం చేసుకునే సౌక‌ర్యం ఉంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం ఆలిండియా రేడియో, దూర‌ద‌ర్శన్ చాన‌ళ్లలో బీజేపీ రోజుకు 184 నిమిషాలు ప్రచారం చేసుకోవ‌చ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ రోజుకు 131 నిమిషాలు ప్రచారం చేసుకోవ‌చ్చు. ఈ నిబంధ‌న‌లు తెలియ‌క చాలా మంది నేత‌లు త‌మ పార్టీని చాలా ఎక్కువ‌గా ఊహించుకుని దెబ్బతినేస్తుంటారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle