పాక్ దూకుడు... యుద్ధం తప్పదా?
29-08-201929-08-2019 09:35:04 IST
Updated On 29-08-2019 16:08:55 ISTUpdated On 29-08-20192019-08-29T04:05:04.642Z29-08-2019 2019-08-29T04:03:02.570Z - 2019-08-29T10:38:55.438Z - 29-08-2019

కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ దుందుడుకు ధోరణితో వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ఎలాగైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ ఉత్సుకతతో ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదని తెగ బాధపడిపోతోంది.
రెండురోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు పలు సంకేతాలిచ్చాయి, అంతర్జాతీయంగా భారత్ పై ఈ విషయంలో వత్తిడి పెంచాలని భావిస్తున్నా అది కుదరడం లేదు. దీంతో యుద్ధ వాతావరణం సృష్టించాలని తహతహలాడుతోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎదురుదెబ్బ తగలడం, రష్యా భారత్‌కు సపోర్ట్ చేయడం, ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా మిన్నకుండిపోవడంతో పాక్ పగతో రగిలిపోతోంది.
తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అక్టోబరు, నవంబరులో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఉద్రికత్తలను మరింత పెంచేలా ఉన్నాయి. బుధవారం రావల్పిండిలో ఓ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
‘నిజంగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే ఐరాస భద్రతా మండలి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేది. ఆక్రమిత లోయలోని ప్రజల పక్షానే మేం నిల్చుంటాం. మొహర్రం తరవాత మరోసారి కశ్మీర్లో పర్యటిస్తాను.
ఇప్పటికీ భారత్‌తో చర్చల గురించి ఆలోచించే వారు తెలివితక్కువ వారే’ అని తన నోటికి పనిచెప్పారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాసలో ఇవ్వబోయే ప్రసంగం గురించి ప్రస్తావించారు.
‘సెప్టెంబరు 27న ప్రధాని ఐక్యరాజ్యసమితిలో ఇవ్వనున్న ప్రసంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. మాకు చైనా వంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం’ అని రషీద్ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు దేశ భద్రతే ప్రధాన అంశం అని అమిత్‌షా స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశంపై ఎవరి జోక్యాన్ని తాము సహించబోమని ఇంతకుముందే ప్రధాపి మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో వేచి చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా