newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాక్‌పై మారిన మోడీ వైఖరి.. యుద్ధం వస్తే వారం చాలన్న ప్రధాని

29-01-202029-01-2020 09:03:06 IST
Updated On 29-01-2020 10:04:15 ISTUpdated On 29-01-20202020-01-29T03:33:06.382Z29-01-2020 2020-01-29T03:33:00.126Z - 2020-01-29T04:34:15.875Z - 29-01-2020

పాక్‌పై మారిన మోడీ వైఖరి.. యుద్ధం వస్తే వారం చాలన్న ప్రధాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాయాది దేశం పాకిస్తాన్ పై భారత్ వైఖరి మారిందా? 

ప్రధాని మోడీ తాజా వ్యాఖ్యలకు అర్థం ఏంటి?

యుద్ధంపై మోడీ వ్యూహం ఏంటి?

ఇమ్రాన్ ఖాన్ కు మోడీ స్ట్రాంగ్ కౌంటరేనా?

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారత్ ఎలా వున్నా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతూనే వుంది. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూనే వుంది. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇప్పటివరకూ భారత్ తో జరిగిన మూడు యుద్ధాల్లో ఓడిపోయినా పాక్‌ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

భారత్‌లో అధికారం చెలాయించిన గత ప్రభుత్వాలు పాక్‌ పరోక్ష యుద్ధాల కుట్రను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూశాయన్నారు. గుణపాఠం చెప్పేందుకు సిద్ధమని మన సైనికదళాలు చెప్పినా.. ఆ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయన్నారు.

గత ప్రభుత్వాలు, కొన్ని కుటుంబాలు కశ్మీర్‌ సమస్యను సాగదీసి, ఉగ్రవాద వ్యాప్తికి తోడ్పడ్డాయని ప్రధాని పరోక్షంగా నెహ్రూ కుటుంబాలను ప్రస్తావించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కీలక పరిణామమని, ఇప్పుడు కాశ్మీర్ అందరిదీ అయిందని, తీవ్రవాదసమస్య తుదముట్టించేందుకు మార్గం సుగమం అయిందన్నారు. 

ప్రధానమంత్రి నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ ర్యాలీని ఉద్దేశించి  ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన రోజూ ధరించే డ్రెస్ కి భిన్నంగా టోపీతో కనిపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇతర దేశాల్లో అణచివేతకు గురయ్యే మైనారిటీల కోసమే  తీసుకువచ్చామన్నారు. వారికి గతంలో భారత్‌ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు.

1950లో నాటి భారత, పాకిస్తాన్‌ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, లియాఖత్‌ అలీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లోని మైనారిటీలకు.. వారు కోరుకుంటే భారత్‌కు రావొచ్చని హామీ ఇచ్చారని, దానిని తాము అమలు చేస్తున్నామన్నారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం అన్నారు నరేంద్ర మోడీ

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   16 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle