newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాకిస్థాన్ అణుయుద్ధ ప్రకటనల మర్మమేమిటి?

17-09-201917-09-2019 07:40:25 IST
2019-09-17T02:10:25.199Z17-09-2019 2019-09-17T02:10:17.609Z - - 10-04-2021

పాకిస్థాన్ అణుయుద్ధ ప్రకటనల మర్మమేమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్...దాయాది దేశం ఇప్పుడు పదే పదే అణుయుద్ధంపై ప్రకటనలు చేస్తున్నది. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల నుంచి మద్దతు కరవై తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కనీసం దేశ ప్రజల మద్దతు కూడా పొందలేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పర్యటించిన ఇమ్రాన్ కు చేదు అనుభవం ఎదురు కావడమే ఇందుకు నిదర్శనం.

ఇమ్రాన్ సమక్షంలోనే అక్కడి ప్రజలు భారత అనుకూల నినాదాలు చేశారు.  తమకు భారత్ లో కలిసిపోవడమే ఇష్టమని తెగేసి చెప్పారు. అటు ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్థాన్ కు కాశ్మీర్ విషయంలో తమ జోక్యం ఉండదని తెగేసి చెప్పింది. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వాదనను తిరస్కరిస్తున్నాయి. ద్వైపాక్షిక అంశంలో తమ జోక్యం ఉండదనీ, భారత్ తోనే తేల్చుకోవాలని తెగేసి చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్ ను తాము గెలవలేమని ఇమ్రాన్ కు తెలుసు. ఆ విషయాన్ని ఆయనేమీ రహస్యంగా ఉంచడం లేదు. భారత్ తో యుద్ధంలో విజయం సాధించడం తమ వల్ల కాదని బహిరంగంగా అంగీకరిచేశారు.

అయితే రెండు అణు దేశాల మధ్య యుద్ధం అంటూ వస్తే ఆ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పడుతుందంటూ పరోక్ష హెచ్చరికలు చేయడం ద్వారా అణుయుద్ధ నివారణ కోసం ప్రపంచ దేశాలు రంగంలోనికి దిగుతాయనీ, కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుంటాయన్నది ఆయన యోచనగా, వ్యూహంగా కనిపిస్తున్నది.

అణు యుద్ధం అంటే ప్రపంచం అంతా కదులుతుందనీ, దాంతో రాజీ ప్రయత్నాల కోసం ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటారన్న వ్యూహంతోనే పాకిస్థాన్ ప్రధాని పదే పదే అణుయుద్ధం తప్పదని ప్రకటనలు చేస్తున్నారు. 

ఒక రకంగా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పవచ్చు. హిరోషిమా, నాగ సాకిల అనుభవం తరువాత ప్రపంచ దేశాలు అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నాయి. అణు సామర్ధ్యం ఉన్న దేశాలు కూడా శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామన్న ఒప్పందంలో భాగస్వాములు కావాల్సిందే.

భారత్- పాక్ లు రెండూ కూడా అణ్వస్త్రాలున్న దేశాలే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం సంభవిస్తే, ఏ దేశమైనా అణ్వాయుధాలను వాడితే...అన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని యుద్ధ ప్రేలాపనలు, అణ్వాయుధాలపై చేస్తున్న ప్రకటనలూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ లో అణు కార్యక్రమం భద్రత లోపభూషిష్టమన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.

పాక్ అణ్వస్త్రాలు ఉగ్రవాదులకు అందే అవకాశాలపై ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సహా అగ్రరాజ్యాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు పాక్ ప్రభుత్వాధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటనలు ఆ ఆందోళనను ఇనుమడింప చేసేవిగా ఉన్నాయి.

కాశ్మీర్ విషయంలో పాక్ యుద్ధానికి తెగబడితే..అణ్వాయుధాలను ప్రయోగిస్తే ఆ ప్రభావం యావత్ప్రపంచంపై ఉంటుందనడంలో సందేహం లేదు. అలా అని పాక్ ప్రకటనలకు బెదిరి, కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల జోక్యం ఏ విధంగా చూసినా ఆమోదయోగ్యం కాదు. ఈ దశలో యుద్ధ ప్రకటనల విషయంలో సంయమనం పాటించేలా పాకిస్థాన్ పై ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైనే ఉంది.

మేరమీరి హెచ్చరికల స్థాయిలో ప్రకటనలు గుప్పిస్తున్న ఇమ్రాన్ ఖాన్ తన వైఖరి మార్చుకోకుంటే...ఇప్పటికే ఏకాకిగా మిగిలిన ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న స్పష్టమైన హెచ్చరిక ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle