పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్
13-07-202013-07-2020 08:43:04 IST
Updated On 13-07-2020 09:31:48 ISTUpdated On 13-07-20202020-07-13T03:13:04.565Z13-07-2020 2020-07-13T03:13:00.688Z - 2020-07-13T04:01:48.408Z - 13-07-2020

భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. ఆయన శివసేన పత్రిక 'సామ్నా' ఇంటర్వ్యూలో దేశ బధ్రకు సంబంధించిన అంశాలపై విశ్లేషించారు. దేశానికి ప్రథమ శత్రువు పాకిస్తాన్ అని అందరు భావిస్తారు కానీ, పాక్ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ కన్నా చైనాయే భారత్‌కు ఎక్కువ ప్రమాదకారి. చైనా సైనిక బలగం భారత్ కంటే పదిరెట్లు ఎక్కువ. భారత పొరుగుదేశాలను చైనా తన వైపునకు తిప్పుకొంది. సంప్రదింపులు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే చైనాపై ఒత్తిడి పెంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలి. చైనా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, చైనాను అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి, దేశ సమస్యను పరిష్కరించాలని సూచించారు. మన విదేశీ విధానాన్ని, ద్వైపాక్షిక సంబందాలను మనం ఎన్నడూ మార్చుకోలేదు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి వరకు ఇవే విధానాలు కొనసాగుతూ వచ్చాయి. కానీ చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌తో స్నేహపూర్వక ప్రకటనలు పర్యటనలకు పిలుపివ్వడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ భిన్నమైన వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. చైనాతో సహా పొరుగుదేశాలతో స్నేహ సంబంధాలను నిర్మిస్తున్నానని మోదీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఎక్కడా ఫలిస్తున్నట్లు లేదు అని కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చైనా పాక్ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని శరద్ పవార్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ద్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముఖ్య అంశాలలో సైతం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని శరద్ పవార్ విమర్శించారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా