newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పశువులకు ఉన్న విలువ కూడా కరోనా రోగులకు లేదా.. సుప్రీం ధ్వజం

13-06-202013-06-2020 11:59:34 IST
Updated On 13-06-2020 13:04:18 ISTUpdated On 13-06-20202020-06-13T06:29:34.704Z13-06-2020 2020-06-13T06:29:31.590Z - 2020-06-13T07:34:18.208Z - 13-06-2020

పశువులకు ఉన్న విలువ కూడా కరోనా రోగులకు లేదా.. సుప్రీం ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పశువులుకు ఉన్న పాటి విలువ కూడా కరోనా బారినపడి మరణించిన రోగులకు లేదా అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య చేసింది. కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడుతూ... తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని మండిపడింది. ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఆస్పత్రుల్లో కోవిడ్ మృతదేహాల నిర్వహణ ఏమాత్రం సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కేసుల్లో అయితే వారి కర్మ కాండలకు కూడా కుటుంబీకులు హాజరు కాలేకపోతున్నారు.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది.

హస్తినలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య 7,000 నుంచి 5,000 కు అమాంతం పడిపోయింది. ఎందుకు అలా పరీక్షల సంఖ్య అమాంతం తగ్గిపోయింది మే మాసంతో పోల్చుకుంటే జూన్ మాసంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. ఢిల్లీలో పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి’’ అని ప్రభుత్వాన్ని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. కరోనా విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు ఏమాత్రం పాటించడం లేదని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.

కరోనా వైరస్ సోకిన రోగులకు జంతువులకు ఉండే పాటి విలువ కూడా లేదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కరోనా సోకిన రోగి చనిపోతే అతడి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేయమేంటి.. దేశంలో వైద్య వ్యవస్థ పనిచేస్తున్నట్లా లేనట్లా అంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ప్రధానంగా ఢిల్లీలో ప్రభుత్వం కాని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కానీ చేష్టలుడిగినట్లు కనిపిస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ పడకలు ఉంటున్నప్పటికీ రోగులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రుల్లో చేరాలంటే నరకయాతన అనుభవిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది.

ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో కోవిడ్-19 రోగుల మృతదేహాలు ఆసుపత్రిలాబీలో, వెయిటింగ్ ఏరియాలో పడి ఉంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా రోగుల మృతదేహాల పట్ల ఆసుపత్రి వర్గాలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్విని కుమార్ జూన్ 8న సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై విచారణ చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   9 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle