పవార్ కు నైతిక స్థైర్యాన్నిచ్చిన మహా ఫలితాలు
26-10-201926-10-2019 07:59:32 IST
Updated On 26-10-2019 17:37:19 ISTUpdated On 26-10-20192019-10-26T02:29:32.072Z26-10-2019 2019-10-26T02:29:29.604Z - 2019-10-26T12:07:19.555Z - 26-10-2019

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు నైతిక స్థైర్యాన్ని ఇచ్చాయనడంలో సందేహం లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు పుణె కుంభకోణంలో ఆయనను ఇరికించడం ద్వారా ఇరుకున పెట్టాలన్న బీజేపీ వ్యూహం వికటించింది. కేవలం ఎన్సీపీని, ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ను టార్గెట్ చేసి మరీ బీజేపీ వ్యూహ రచన చేసినా జనం ఆయనకు అండగా నిలిచామన్న సంకేతాన్ని ఇచ్చి ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింప చేశారు. శరద్ పవార్ సత్తా చాటడం వల్లనే ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమికి మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. అధికారానికి కొంచం దూరంలో ఆగిపోయినప్పటికీ ఆ కూటమికి ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. కూటమిగానే కాకుండా పార్టీలుగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీలు బలోపేతం అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంతా తానై పడిన శ్రమకు ఫలితం దక్కిందనే చెప్పాలి. వయోభారాన్ని లెక్క చేయకుండా ఆయన ప్రచారంలో దూసుకుపోయిన తీరు, జోరు వానలో కూడా ఆగకుండా చేసిన ప్రసంగం ప్రజలలో ఆయన పట్ల ఒక సానుకూలతకు కారణమైంది. పవార్ ప్రచారం ఎన్సీపీకే కాకుండా కాంగ్రెస్ కు కూడా లాభించింది. పుణె బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు సమన్లు జారీ చేయడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు సరికదా...వికటించింది. ఆ మేరకు కమలం పార్టీయే దెబ్బతింది. ఆ ఫలితమే...రెండొందలకు పై చిలుకు స్థానాల్లో విజయం సాధిస్తామని ఘనంగా చాటుకున్న కమలం పార్టీ చివరకు బొటాబొటీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవలసి వచ్చింది. పవార్ ను ఇరుకున పెట్టాలన్న ప్రయత్నం కారణంగానే ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి కొంచం అటూ ఇటూగా వంద స్థానాలు దక్కాయి. అన్ని విధాలుగా తమకు సానుకూల వాతావరణం ఉందని భావించిన కమల దళం ఫలితాలతో బిత్తరపోయింది. 2014 శివసేనతో పొత్తు లేకుండా పోటీ చేసిన బీజేపీ 122 స్థానాలలో విజయం సాధించగా...అప్పుడు శివసేన 62 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సారి రెండూ కలిసి కూటమిగా పోటీలో దిగినప్పటికీ...గతంలో వచ్చినన్ని స్థానాలను కూడా దక్కించుకోలేకపోయాయి. మరో వైపు కాంగ్రెస్ గత ఎన్నికల కంటే మూడు స్థానాలను అధికంగా గెలుచుకుంది. ఆ పార్టీ ఎన్నికలపై మరింత దృష్టి పెట్టి అగ్రనాయకత్వం ప్రచారంలో చురుకుగా పాల్గొని ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఫలితాల సరళిని బట్టి అర్ధమౌతున్నది. కాగా ఎన్సీపీ మాత్రం ఈ ఎన్నికలలో బాగా లాభపడిందనే చెప్పాలి. గతంలో అంటే 2014 అసెంబ్లీ ఎన్నికలలో 41 స్థానాలను గెలుచుకున్న ఎన్సీపీ ఈ సారి 54 స్థానాలలో విజయ కేతనం ఎగుర వేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లా కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంపై సీరియస్ గా దృష్టి పెట్టి...కష్టపడి ఉంటే...మహారాష్ట్ర ఎన్నికల ఫలితం మరోలా ఉండేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా కమల నాథుల భ్రమలను మహా ఎన్నికల ఫలితం తొలగించేసిందనడంలో సందేహం లేదు. శివసేన- బీజేపీ పొత్త వల్ల రెండు పార్టీలూ కూడా లాభపడలేదు. గత ఎన్నికల కంటే రెండు పార్టీలకూ ఈ సారి తక్కువ సీట్లే వచ్చాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత నెమ్మది నెమ్మదిగా ప్రోది అవుతున్న సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చాయి.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
39 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
2 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
11 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
5 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
a day ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago
ఇంకా