పవార్‌కు తెలీకుండానే ఇంత పని జరిగిందా? నమ్మొచ్చా?
24-11-201924-11-2019 08:04:42 IST
2019-11-24T02:34:42.665Z24-11-2019 2019-11-24T02:34:38.548Z - - 11-04-2021

మహారాష్ట్ర రాజకీయం ఇంత ఆకస్మిక మలుపులు తిరుగుతోందని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత శరద్ పవార్‌కి నిజంగా తెలీదా. శనివారం ఏడుగంటలకు మాత్రమే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తనకు తెలిసిందంటున్న శరద్ పవార్ మాటలు నిజమేనా.. నిజమే అయితే 50 ఏళ్లపైబడిన ఆయన రాజకీయ జీవితంలో ఇంతకు మించిన అవమానకరమైన ఘటన మరొకటి ఉండదేమో.. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్ పవార్ ప్రకటించిన తరుణంలో అజిత్ పవార్ ఆయనకు ఊహించని షాకిచ్చారు. ఆయనకు 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి పదవి కోసమే శరద్ పవార్ బీజేపీకి మద్దతు ఇచ్చారంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అజిత్ పవార్ తమకు వెన్నుపోటు పొడిచారని శివసేన ఆరోపించగా, ఎన్సీపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ కాంగ్రెస్ విమర్శించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలువు తిరిగింది. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టింది. తెరవెనక రాజకీయాలు చేసి ఎన్సీపీని తన వైపుకు తిప్పుకుంది. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్ పవార్ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో రహస్య మంతనాలు చేశారు. తమకు మద్దతు ఇస్తే డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నత పదవులను ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే తొలి నుంచి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్ పవార్ బీజేపీ నేతల చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అజిత్ చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు షాక్‌కి గురయ్యారు. అయితే ఈ వ్యవహారమంతా శరద్ పవార్‌కు తెలియకుండా అజిత్ పవార్ జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా