newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పవన్ ఢిల్లీ టూర్.. అనూహ్య పరిణామాలుంటాయా?

15-11-201915-11-2019 13:43:08 IST
Updated On 15-11-2019 16:58:45 ISTUpdated On 15-11-20192019-11-15T08:13:08.769Z15-11-2019 2019-11-15T08:13:06.759Z - 2019-11-15T11:28:45.658Z - 15-11-2019

పవన్ ఢిల్లీ టూర్.. అనూహ్య పరిణామాలుంటాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేస్తుందో జనసేన పార్టీ నుండి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంతకు రెట్టింపు పోరాటమే చేస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై మొదలైన పవన్ పోరాటం.. సమస్య మారుతున్నా పోరాటం మాత్రం ఆపడం లేదు. ఇసుక సమస్యపై తీవ్రంగా స్పందించిన జనసేన లాంగ్ మార్చ్ తలపెట్టి ప్రభుత్వానికి తలపోటు తెప్పించింది.

ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తెలుగు మీడియా రద్దు నిర్ణయంపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. అదే సమయంలో సీఎం స్థాయి వ్యక్తి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినా పవన్ సంయమనంతోనే చురకలంటిస్తూ తిప్పికొట్టారు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇది నేతలను మించి కుటుంబాలను కూడా అందులోకి ఈడ్చేసి కంపు కొట్టించేశారు.

సోషల్ మీడియా వ్యవహారాన్ని పక్కనపెడితే రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికుల ఆత్మహత్యలు, సంప్రదాయాలకు విరుద్ధంగా బలవంతపు పోకడలు, రాజధాని వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావించారని ఆ మధ్య గూగుసలు వినిపించాయి. అయితే అది అప్పటి నుండి సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారైంది.

పవన్ ఢిల్లీ ప్రయాణం అధికారికం కాదని.. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసమేనని జనసేన వర్గాలు చెబుతున్నా.. అంతకు మించి ఢిల్లీలో ఏదో జరగబోతుందని పవన్ సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పవన్ ఈ టూర్లోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉందని, ఇప్పటికే అపాయింట్ మెంట్లు కూడా ఖరారయ్యాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

2014 ఎన్నికలకు ముందు పవన్ అహ్మాదాబాద్ వెళ్లి మోడీతో ప్రత్యేకంగా సమావేశమై టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ మోడీతో సన్నిహితంగానే మెలిగారు. గత ఐదేళ్లలో విబేధించిన పవన్ మోడీని మాత్రం తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా పలుసందర్భాలలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇప్పుడు ఢిల్లీలో అపాయింట్ మెంట్లు ఖరారయ్యాయని చెప్తున్నారు.

ఇక పవన్ ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిస్థితిలు రానున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మరి పవన్ ఢిల్లీ పెద్దలకు ఏం చెప్పబోతున్నారు? అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? బీజేపీ పెద్దలను కలుస్తారా? లేక ప్రైవేట్ కార్యక్రమంతోనే వెనుదిరుగుతారా? ఏపీ రాజకీయాలలో పవన్ ఢిల్లీ టూర్ కాసింత ఉత్కంఠను కలిగిస్తుందని చెప్పకతప్పదు.

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle