newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పదవి కోసం కాదు.. దేశ హితమే మా ప్రాధాన్యత.. కపిల్ సిబాల్

27-08-202027-08-2020 06:52:57 IST
2020-08-27T01:22:57.771Z27-08-2020 2020-08-27T01:22:54.786Z - - 20-04-2021

పదవి కోసం కాదు.. దేశ హితమే మా ప్రాధాన్యత.. కపిల్ సిబాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని కాంగ్రెస్ అధిష్టానానికి నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివరణ ఇచ్చారు. పార్టీ నాయకత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో తాము సవాలు చేయలేదని, పార్టీ అధ్యక్ష పదవిలో సోనియా గాంధీనే కొనసాగాలని ఇప్పటికీ కోరుకుంటున్నామని వీరు పేర్కొన్నారు. 

ఇది పదవికి సంబంధించిన విషయం కాదు.. దేశానికి సంబంధించిన విషయం. అదే మాకు ముఖ్యం అని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తెలిపారు. లేఖను ఇప్పుడు తప్పుబడుతున్న వారు త్వరలో ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రాముఖ్యతను గుర్తిస్తారని మాజీ కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తపర్చడమే తాము రాసిన లేఖ ప్రధాన ఉద్దేశమన్నారు.

నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లలో పలువురు మంగళవారం పలు వివరణలతో ముందుకు వచ్చారు. పార్టీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో సోనియాగాంధీనే కొనసాగాలని కోరుకుంటున్నామని వివరణ ఇచ్చారు. 

మిత్రులారా.. మేం అసమ్మతివాదులం కాదు. పార్టీ పునరుత్తేజాన్ని కోరుతున్నవాళ్లం. ఆ లేఖ నాయకత్వాన్ని సవాలు చేస్తూ రాసింది కాదు.. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాసింది. చరిత్ర ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది. పిరికివారిని కాదు అని లేఖపై సంతకం చేసిన మరో నేత, ఎంపీ వివేక్‌ తాన్ఖా ట్వీట్‌ చేశారు. 

పార్టీకి క్రియాశీల, పూర్తిస్థాయి నాయకత్వం అవసరమంటూ 23 మంది సీనియర్లు పార్టీ చీఫ్‌ సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏఐసీసీ భేటీ జరిగేవరకు పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని సోమవారం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

సోనియా పార్టీకి అమ్మ వంటిది 

గాంధీ కుటుంబం త్యాగానికి పేరుగాంచిందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వం పార్టీకి అవసరమని, అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఆమె అంగీకరించడం స్వాగతించదగిన అంశమన్నారు. తమ లేఖతో ఆమెకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యులమన్నారు. పార్టీకి సోనియా అమ్మలాంటి వారని,  శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన తాను.. అన్ని సంక్షోభ సమయాల్లో పార్టీ నాయకత్వం వెంటనే నడిచానని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థీకృత పునరుత్తేజం కోసమే లేఖ రాశామని మొయిలీ స్పష్టం చేశారు.

పార్టీ అంతర్గత అవసరాల కోసం రాసిన లేఖ బహిర్గతం కావడం సరికాదని, అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. లేఖపై సంతకం చేసిన 23 మంది సీనియర్‌ నేతల్లో ఎవరికీ పార్టీని వీడి వెళ్లే ఆలోచన లేదన్నారు. బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్య మౌలిక విలువలైన లౌకికత్వం, సమానత్వం, బహుళత్వం ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సోమవారం రాత్రి కపిల్‌ సిబల్, శశి థరూర్, ముకుల్‌ వాస్నిక్, మనీశ్‌ తివారీ తదితరులు ఆజాద్‌ ఇంట్లో సమావేశమవడం గమనార్హం.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle