newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పథకం ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు.. పోలీసు శాఖ దిగ్భ్రాంతి

29-02-202029-02-2020 10:25:38 IST
Updated On 29-02-2020 16:20:41 ISTUpdated On 29-02-20202020-02-29T04:55:38.042Z29-02-2020 2020-02-29T04:55:36.137Z - 2020-02-29T10:50:41.764Z - 29-02-2020

పథకం ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు.. పోలీసు శాఖ దిగ్భ్రాంతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధాని నగరంలో అల్లర్లలో పాల్గొనడానికి మూకలను తరలించడంలో ప్రదర్శించిన వేగం పోలీసు శాఖను నివ్వెరపరుస్తోంది. మూడురోజులపాటు కొనసాగిన అల్లర్లలో 350 ఖాళీ కాట్రిడ్జ్‌లు పేల్చడం, 500 రౌండ్ల కాల్పులు చేయడం ఎవరికి ఎలా సాధ్యమైందన్నది పోలీసులకే అంతుబట్టడం లేదు. మొత్తం 82 మందికి బుల్లెట్ గాయాలు తగలగా శుక్రవారం రాత్రి వరకు అల్లర్లలో మృతుల సంఖ్య 42కు పెరిగిందని అధికారిక సమాచారం.

ఈ అల్లర్లలో లైసెన్స్ లేని దేశవాళీ పిస్టల్స్ ను భారీగా ఉపయోగించడం సంప్రదాయవిరుద్ధంగా కనిపిస్తోందని పోలీసు శాఖ భావిస్తోంది. సాదారణంగా మతపమైన అల్లర్లు జరిగే సందర్భాల్లో చాలామంది బాధితులు తమపై నిర్బంధ హింస వల్ల కలిగిన మానసిక అఘాతానిక గురై చనిపోతారని, లేక సజీవ దహన చర్యల బారిన పడి మరణిస్తారని, కానీ ఢిల్లీలో తాజా అలర్లలో బాధితులైనవారు ఎక్కువగా బుల్లెట్ల బారిన పడటం షాక్ కలిగిస్తోందని ఢిల్లీ పోలీసు అదికారులు చెబుతున్నారు. 

ఇంటెలిజన్స్ బ్యూరో అధికారిని దారుణంగా హతమార్చిన ఘటనకు కారకుడిగా చెబుతున్న ఆఫ్ నేత తాహిర్ హుస్సేన్ ఇంట్లో ముందుగానే సిద్ధం చేసిన పెట్రోల్ బాంబులు, ఖాళీ సీసాలు, రాళ్లు, ఇటుకలు కనిపించాయని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి చెందిన సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. 

ప్రధానంగా నగర పోలీసు ఇంటెలిజెన్స్ వైఫల్యమే అల్లర్లకు కారణమని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థాగత వైఫల్యానికి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి విషాదంగా ఘోరమరణం పాలయ్యారని వీరు ఆవేదన చెందుతున్నారు. 

ఉత్తర ప్రదేశ్ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ రాజధానీ నగరంలో 40 పైగా మరణాలకు, దహనకాండకు పోలీసుశాఖ అలసత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు. అల్లర్లు జరిగినప్పుడు పట్టించుకోకుండా ఉండటమంటే మీరు గుడ్డివాళ్లయిపోయి ఉండాలి. తొలిరోజు నుంచే పోలీసులు రాత్రంతా శోధించి ఉండాల్సింది. ఇళ్లలో రాళ్లు, ఇటుకలు పోగు చేసిన వారిని నిర్బంధంలోకి తీసుకుని ఉండాలి. కానీ ఢిల్లీ పోలీసులు అది తమ కర్తవ్యం కాదనే రీతిలో ఉండిపోయారు. అని ప్రకాష్ సింగ్ చెప్పారు.

రాజధాని నగరంలోని 90 వేల మంది పోలీసులు ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను అడ్డుకోలేకపోయింరంటే నమ్మశక్యంగా లేదని మాజీ డీజీపీ ఆశ్యర్యాన్ని వ్యక్తిపరిచారు. అల్లర్లు వంటి తక్షణ ఘటనలతో వ్యవహరించడానికి, వ్యవహరించకపోవడానికి పోలీసులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోనవసరం లేదు. చివరకు ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ సైతం అలాంటి సందర్బాలకు అనుగుణంగా వ్యవహరించగలరు. అల్లర్ల సమయంలో షారుక్ అనే వ్యక్తి నేరుగా పోలీసులకే పిస్టల్ గురిపెట్టి బెదిరించాడంటే పోలీసులు పట్ల కానీ, చట్టం పట్ల కానీ దుండగులకు భయమనేదే లేకుండా పోయినట్లు అర్థమని చెప్పారు.

కాగా అల్లర్లు తగ్గుముఖం పట్టాక పోలీసుల తేరుకుని 148 కేసులు నమోదు చేసి 600మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అల్లర్లలో పాల్గొన్నవారు, ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వసం చేసినవారికి ఉత్తర ప్రదేశ్ నమూనాను అనుకరించి జరిగిన నష్టాలకు ముష్కరులే చెల్లించే విధానాన్ని ఢిల్లీ అల్లర్ల ఘటనకు కూడా వర్తింప చేసి చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారులు చెబుతున్నారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle