newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

పంజాబ్ సీఎంని వేధిస్తున్న వింత సమస్య

09-05-201909-05-2019 07:48:31 IST
2019-05-09T02:18:31.098Z09-05-2019 2019-05-09T02:18:28.221Z - - 26-08-2019

పంజాబ్ సీఎంని వేధిస్తున్న వింత సమస్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఏదో ఒక స‌మ‌స్య‌తో పార్టీలు జ‌నం ముందుకు వెళ్ల‌డం స‌హ‌జం. కానీ ఈసారి పంజాబ్ ప‌రిస్థితి ఇందుకు పూర్తిగా మారింది. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌మే పార్టీల ముందు ఎజెండా పెట్టారు. ముఖ్యంగా రైతులు పెట్టిన డిమాండ్ అర్థం చేసుకున్న పార్టీల‌కు మైండ్ పోయింద‌ట‌. 

అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌తిప‌క్ష బీజేపీ, అకాళీద‌ళ్ కూట‌మికి ఇప్పుడు ఈ రైతుల టెన్ష‌న్ మొద‌లైంది. దేశ వ్యాప్తంగా గోధుమ‌లు, ఉల్లిపాయ‌ల సాగులో పంజాబ్ కూడా అగ్ర‌స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది పంజాబ్ ఉల్లి, గోధుమ రైతుల‌కు కొత్త  స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఉల్లిపాయలు, గోధుమ దిగుబ‌డి బాగానే ఉన్నా, వాటిని ఇత‌ర ప్రాంతాల‌కు తీసుకెళ్ల‌డానికి గోతాలు క‌రువు అయ్యాయ‌ట‌. దీంతో పంజాబ్ సీఎం మీద మండిప‌డుతున్నారు రైతులు. 

సీజ‌న్ మొద‌లు అయిన స‌మ‌యంలోనే తాము గోతాల గురించి అడిగినా అప్పుడు ఓకే అన్న పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేంద‌ర్ సింగ్, ఇప్పుడు త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. గోతాల కోసం మండ‌ల కేంద్రాల ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్న రైతులు, ఓట్ల కోసం వ‌చ్చే పార్టీల అభ్య‌ర్ధుల‌ను గోతాలు ఇచ్చాకే ఓట్లు అడ‌గ‌మ‌ని తెగేసి చెప్పార‌ట‌. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ అభ్య‌ర్ధులకు ఈ బెడ‌ద ఎక్కువ అయింద‌ట‌. 

దీంతో వారంతా కెప్టెన్ ముందు మోక‌రిల్లారు. ఏదో ఒక‌టి చేయ‌మ‌ని వేడుకున్నార‌ట‌. ప‌రిస్థితి చేయిదాట‌క ముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్న పంజాబ్ సీఎం, ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకు త‌మ‌కు 3 ల‌క్ష‌ల గోతాలు కావాలంటూ లేఖ రాశారు. అయితే ఆయ‌న‌కు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చారు ఎఫ్ సిఐ అధికారులు. గ‌తంలో ఇచ్చిన గోతాల‌కు బిల్లు చెల్లిస్తేనే కొత్త గోతాలు ఇస్తామ‌ని మెలిక పెట్టారు. 

దీంతో రైతుల‌కు ఏం చెప్పాలో అర్థం కాని పంజాబ్ సీఎం, కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌నే త‌మ మీద క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని ఆరోపిస్తున్నారు. మొద‌ట సీఎం మాట‌ల‌ను న‌మ్మిన రైతులు, ఆ త‌ర్వాత విష‌యం అర్థం అయిన త‌ర్వాత ఎదురు తిరిగార‌ట‌. మ‌రోవైపు హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు దాదాపు5 ల‌క్ష‌ల గోతాల‌ను ఎఫ్ సిఐ స‌ర‌ఫ‌రా చేసింది. అప్ప‌టికీ హ‌ర్యానా ప్ర‌భుత్వం త‌మ‌కు ఇంకా అవ‌స‌ర‌మ‌ని చెప్పినా, ఎఫ్ సిఐ అధికారులు చేతులెత్తేశార‌ట‌. 

దీంతో రైతుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా బీ క్లాస్ గోతాల‌ను హ‌ర్యానా ప్ర‌భుత్వం రైతుల‌కు అందించింది. ఈ విష‌యం తెల్సుకున్న పంజాబ్ రైతులు త‌మ‌కు కూడా బీ క్లాస్ గోతాలు అందించాల‌నీ, గోధుమ‌ల గోతాల‌ను 5 శాతం పెద్ద‌విగా ఉండేలా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా భ‌టిండా, మన్సా, ఫ‌జిల్కా, ఫిరోజ్ పూరో, ముక్తార్, హోషియార్ పూర్, అమ్రుత్ స‌ర్, త‌ర‌న్ త‌ర‌న్ ప్రాంతాల నుంచి ఈ డిమాండ్ ఎక్కువ అయింది. 

గ‌త ఎన్నిక‌ల్లో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ణ‌నీయ‌మైన స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు అక్క‌డి రైతులే ఎదురు తిర‌గ‌డంతో ప‌రిస్థితి ఎలా ఉంటుందో అనేది పంజాబ్ సీఎం అనుమానం. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక పంజాబ్ సీఎం టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle