నేపాల్ ఎందుకిలా చేస్తోంది ? భారత్‌తో నేపాల్ పేచీ వెనుక చైనా ?
22-05-202022-05-2020 08:06:35 IST
Updated On 22-05-2020 08:55:21 ISTUpdated On 22-05-20202020-05-22T02:36:35.812Z22-05-2020 2020-05-22T02:36:27.642Z - 2020-05-22T03:25:21.609Z - 22-05-2020

భారత్‌కు సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో నేపాల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా రెండు దేశాల మధ్య మైత్రి కొనసాగుతోంది. చిన్న దేశమైన నేపాల్ చాలా విషయాల్లో భారత్‌పై ఆధారపడేది. అయితే, ఇప్పుడు క్రమంగా చైనా వైపు మొగ్గుతున్న నేపాల్ తరచూ భారత్‌పై నిందలు మోపుతోంది. సరిహద్దు పేచీ పెడుతోంది. భారత్‌లోని భూభాగాలు తమవిగా చెప్పుకుంటోంది. ఈ వైఖరి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తోంది. నేపాల్ మరెవరి కోసమే ఇలా వ్యవహరిస్తోందని పరోక్షంగా నేపాల్ వ్యాఖ్యల వెనుక చైనా పాత్ర ఉందని భారత్ భావిస్తోంది. భారత్ భూభాగంలోని కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు తమవే అంటోంది నేపాల్. చాలా కాలంగా ఈ వాదనను నేపాల్ వినిపిస్తున్నా ఇప్పుడు ఈ విషయమైన కటువుగా వ్యవహరిస్తోంది. ఇటీవల నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌లో ఈ మూడు ప్రాంతాలు ఆ దేశ భూభాగాలుగా చూపించింది. ఈ మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండలి ఆమోదించింది. ఈ విషయమై ఆ దేశ పార్లమెంటులో మాట్లాడిన నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. నేపాల్ గత పాలకులు ఎవరూ ఈ మూడు ప్రాంతాల గురించి మాట్లాడలేదని చెప్పిన ఆయన, ఇప్పుడు తాము భారత్ నుంచి ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. మానస సరోవర్ వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్‌లోని నేపాల్ తమదిగా చెప్పుకుంటున్న లిపులేఖ్ ప్రాంతంలో భారత్ రహదారిని నిర్మించింది. ఈ రహదారిని ఈ నెల 8వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సమయంలోనూ భారత్‌పై నిరసన తెలిపిందే. తమ భూభాగానికి చెందిన ప్రాంతాల్లో రోడ్డు వేయడాన్ని తప్పుపట్టింది. ఆ దేశ రాజధానిలో కాఠ్మాండూలో కొందరు భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలకు కూడా దిగారు. అయితే, ఇది పూర్తిగా తమ భూభాగమేనని, పైగా ఇది కొత్త దారి కాదని, అనేక ఏళ్లుగా యాత్రికులు ఉపయోగిస్తున్న దారేనని భారత్ వాదిస్తోంది. ఇదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నేపాల్ ఆరోపణల వెనుక చైనా ప్రమేయం ఉందేమోనని పరోక్షంగా అనుమానించారు. ఎవరి కోసమే నేపాల్ ఈ ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు. అయితే, 1816లో అప్పుడు భారత్‌ను పాలించిన బ్రిటీష్ ప్రభుత్వానికి - నేపాల్‌కు మధ్య జరిగిన సుగౌలి ఒప్పందం ప్రకారం ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌వేనని ఆ దేశం అంటోంది. చాలా రోజులుగానే ఈ వాదనలు చేస్తున్నా గత అక్టోబరులో నేపాల్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటించిన తర్వాతనే భారత్ - నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. దీంతో చైనానే నేపాల్‌ను పావుగా వాడుకుంటూ భారత్‌పై విమర్శలు చేయిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాలు భారత్‌కు చాలా కీలకం. 1962 చైనాతో యుద్ధ జరిగిన నాటి నుంచి భారత్ ఈ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తోంది. మరీ ముఖ్యంగా కాలాపానీలో ఉండే పర్వతశ్రేణులు భారత సరిహద్దు భద్రతకు కీలకం. ఇక్కడకు అతి సమీపంలో చైనాకు చెందిన బురాంగ్ సైనిక స్థావరం ఉంది. కాలాపానీ మన ఆధీనంలో లేకపోతే భారత్‌లోకి ఇక్కడి నుంచి చైనా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందుకే భారత్ కూడా ఈ ప్రాంతాన్నీ కీలకంగా తీసుకుంది. అయితే, దౌత్యపరంగా చర్చల ద్వారానే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధాని ప్రకటించారు. కానీ, భారత్ భూభాగంలోని ప్రాంతాలను నేపాల్ మ్యాప్‌లో చూపించడంపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గుర్తించి నేపాల్ తయారుచేసిన వాస్తవవిరుద్ధ మ్యాప్‌ను రద్దు చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దౌత్యపరంగా చర్చించేందుకు అవకాశం ఉండేలా నేపాల్ చర్యలు ఉండాలని ఆకాంక్షించింది. మరోవైపు ఈ వ్యవహారంలో చైనా కూడా స్పందించింది. భారత్ - నేపాల్ దౌత్యపరంగా ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
11 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా