newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేను బీజేపీలో చేరట్లేదు..సచిన్ పైలట్ క్లారిటీ

15-07-202015-07-2020 10:42:52 IST
Updated On 15-07-2020 12:21:46 ISTUpdated On 15-07-20202020-07-15T05:12:52.692Z15-07-2020 2020-07-15T05:12:22.927Z - 2020-07-15T06:51:46.569Z - 15-07-2020

నేను బీజేపీలో చేరట్లేదు..సచిన్ పైలట్ క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజస్థాన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన తర్వాత సచిన్ పైలట్ తన మనసులో మాట బయటపెట్టారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇదిలా ఉంటే రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్ తీవ్రచర్యలకు దిగింది. సచిన్ పై చర్యలు చేపట్టిన అనంతరం బీజేపీ కూడా స్పందించింది.

తమ పార్టీలోకి ద్వారలు తెరిచే వున్నాయని, తమ పార్టీ విధానాలు నచ్చినవారు ఎప్పుడైనా, ఎవరినైనా ఆహ్వానిస్తామని పేర్కొంది. అయితే తాను బీజేపీలోకి వెళ్లడం లేదని సచిన్ పేర్కొనడంతో అతని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అంతకుమందు కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ పరిణామాలపై ఆచితూచి స్పందించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠిన నిర్ణయాలు ప్రకటించింది. మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో చివరకు సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు.

పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అంతేగాక, సచిన్ కు మద్దతు పలికిన ఇద్దరు మంత్రులను కూడా తొలగించింది.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఆడించినట్లు సచిన్ పైలట్ ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో చేసిన పనిని రాజస్థాన్‌లోనూ చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు.

బీజేపీ రిసార్టు రాజకీయాలు నడుపుతోందని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పులో ఉందన్నారు గెహ్లాట్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే బీజేపీ కుట్రలో సచిన్ భాగమయ్యారని గెహ్లాట్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు, 

సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు అన్ని అవకాశాలు కల్పించామని, అయినా సీఎల్పీ భేటీకి వారు హాజరుకాలేదని సీఎం గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేస్తున్న నేతల డిమాండ్లకు తాము అంగీకరించినప్పటికీ.. వారు మాత్రం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్దారు. ఈనెల 16వ తేదీన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle