newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

నేతల కామెంట్లు.. ఈసీ చురకలు

06-05-201906-05-2019 11:47:47 IST
Updated On 01-07-2019 16:27:11 ISTUpdated On 01-07-20192019-05-06T06:17:47.551Z06-05-2019 2019-05-06T06:17:45.639Z - 2019-07-01T10:57:11.788Z - 01-07-2019

నేతల కామెంట్లు.. ఈసీ చురకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొంత మంది సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు నోరు దురుసుతో ర‌చ్చకెక్కారు. కొంద‌రు ఎన్నిక‌ల‌ ప్రచారంలో భాగంగా మాట్లాడితే మరికొంద‌రు అనాలోచితంగా మాట్లాడి ప‌రువు తీసుకున్నారు. ప్రధాని న‌రేంద్ర మోడీ మే 1వ తేదీన మ‌ధ్యప్రదేశ్ ప్రచారంలో చెప్పిన డైలాగ్ వివాదాస్పద‌మైంది. కాంగ్రెస్ పార్టీ నేత‌లు తాను త్వర‌గా చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నార‌నీ, అప్పటి వ‌ర‌కూ వారికి నిద్ర ప‌ట్టడం లేద‌న్నారు మోడీ. ఈ వ్యాఖ్యలు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద విచారించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆ త‌ర్వాత మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. 

ఇక చౌకీదార్ చోర్ అంటూ త‌న ప్రతి ప్రసంగంలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈసీతో పాటు సుప్రీం కోర్టు చేతిలో చివాట్లు తిన్నారు. అలాగే బీజేపీ ఎంపీ మేన‌కాగాంధీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏప్రియ‌ల్ 12వ తేదీన సుల్తాన్ పూర్ స‌భ‌లో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో తాను గెల‌వ‌డం ఖాయ‌మ‌న్న మేన‌కాగాంధీ, త‌న విజ‌యంలో ముస్లింలు కూడా భాగం అవ్వాల‌ని కోరారు. అలా కాక‌పోతే త‌న దగ్గర‌కు ప‌నుల కోసం రావద్దన్నారు. ఓటు వేయ‌క‌పోయినా పనులు చేయ‌డానికి మ‌న‌సు ఒప్పుకోద‌నీ, ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉండాల‌ని చెప్పారు. దీనిపై ఈసీ సీరియ‌స్ అయింది. 

ఇక బాలీవుడ్ తార మూన్ మూన్ సేన్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జ‌నంలో చుల‌క‌న అయ్యారు. ప‌శ్చిమ బెంగాల్లోని అసోన్ సోన్ పార్లమెంట్ సీటు నుంచి టీఎంసీ అభ్యర్థిగా బ‌రిలో దిగిన సేన్, ఈ ప్రాంతానికి వ‌స్తే త‌న తల్లి సుచిత్రా సేన్ గుర్తుకు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు త‌న ప్రత్య‌ర్థి కేంద్ర మంత్రి బ‌బూల్ సుప్రియో మీద జ‌రిగిన దాడి మీద కూడా నోరుపారేసుకున్నారు. సుప్రియో మీద జ‌రిగిన దాడి విష‌యం త‌న‌కు తెలియ‌ద‌నీ, ఆ స‌మ‌యంలో తాను నిద్రపోతున్నాన‌నీ చెప్పారు. ఈ రెండు కామెంట్లతో జ‌నానికి కోపం వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఆమెను ఏకిపారేశారు. 

ఇక యూపీలోని రాంపూర్ ఎంసీ సీటు నుంచి ఎస్పీ అభ్యర్థిగా బ‌రిలో దిగిన అజంఖాన్, త‌న ప్రత్యర్థి, బీజేపీ నేత జ‌య‌ప్రద మీద నీచ‌మైన కామెంట్లు చేశారు. జ‌య‌ప్రద ఖాకీ రంగు డ్రాయ‌ర్ వేసుకుంద‌న్న ఆయ‌న వ్యాఖ్యల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది. మూడు రోజుల పాటు అజంఖాన్ ప్రచారం మీద నిషేధం విధించింది. ఇక హిమాచ‌ల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స‌త్పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల‌తో ఇబ్బంది ప‌డ్డారు. చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్ గాంధీ ఆరోప‌ణ మీద మండిప‌డ్డ స‌త్పాల్ సింగ్, కౌంట‌ర్ ఇచ్చే య‌త్నంలో నోరు జారేశారు. సోనియా, రాహుల్, రాబ‌ర్ట్ వాద్రాలు బెయిల్ మీద ఉన్నార‌న్న ఆయ‌న‌, మోడీ మీద నోరు జారితే న‌రికేస్తానంటూ కామెంట్ చేశారు. 

దీంతో ఆయ‌న మీద కేసు న‌మోదు అవ్వడంతో పాటు, రెండు రోజుల పాటు ప్రచారం చేసుకునే అవ‌కాశం కోల్పోయారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి దొరికిపోయారు. ఏప్రియ‌ల్ 15వ తేదీన దేవ్ బంద్ స‌భ‌లో ప్ర‌సంగించిన మాయావ‌తి, ముస్లింలు బీజేపీకి ఓటు వేయ‌వ‌ద్ద‌ని కోర‌డంపై ఈసీ సీరియ‌స్ అయింది. రెండు రోజుల పాటు ఆమె ప్ర‌చారంపై నిషేధం విధించింది. ఇక బెంగ‌ళూరుకు చెందిన బీజేపీ నేత తేజ‌శ్వి సూర్య కూడా నోరు పారేసుకున్నారు. మోడీకి ఓటు వేయ‌ని వారంతా దేశ ద్రోహులు అంటూ కామెంట్ చేశారు.

అలాగే భోపాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కూడా అనాలోచితంగా మాట్లాడి ఇబ్బంది ప‌డ్డారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో త‌న‌ను వేధించిన పోలీస్ అధికారి హేమంత్ క‌ర్కరే, త‌న శాపంతోనే చ‌నిపోయాడ‌నీ చెప్పారు ఆమె. దీంతో ఇబ్బంది ప‌డ్డారు. ఇక యూపీ బీజేపీ నేత రంజిత్ బ‌హ‌దూర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏప్రియ‌ల్ 20వ తేదీన బారాబంకీ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌, ముస్లింలు అంద‌రూ ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేయాల‌న్నారు. అలా చేయ‌క‌పోతే, ఎన్నిక‌ల త‌ర్వాత చైనా నుంచి 12 వేల మిష‌న్లు తెప్పించి వారి గ‌డ్డాల‌ను తీసేసి, వారిని హిందువులుగా మారుస్తాన‌ని చెప్పారు. మొత్తానికి వీరిలో చాలా మంది నేత‌లు దేశ వ్యాప్తంగా తెలియ‌క పోయినా, త‌మ కామెంట్లతో ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో హాట్ టాపిక్ అయ్యారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle