newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

07-08-202007-08-2020 12:38:33 IST
2020-08-07T07:08:33.966Z07-08-2020 2020-08-07T07:08:30.247Z - - 17-04-2021

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత 46 సంవత్సరాల చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ వర్షం బారినపడిన దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రకృతి బీభత్సానికి అసలైన నమూనాగా నిలిచి వణికిస్తోంది. రోడ్లపై కార్లు, బళ్లు కొట్టుకుపోవడం, బలమైన చెట్లు కూకటివేళ్లతో సహా కుప్పగూలడం, కీలకప్రాంతాల్లోని ఇళ్లు సగం వరకు నీరు చేరి మునిగిపోవడం.. ముంబై మహానగరం అక్షరాలా వణికిపోతోంది. మరో 24 గంటలు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ముంబైవాసులు తల్లడిల్లిపోతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబై చరిత్రలో ఎరుగని భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతుంది. కుండపోతగా కురుస్తున్న వర్షధారలతో ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రభుత్వం ఇప్పటికే సబర్బన్‌ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. 

దక్షిణ ముంబైలోని కొలాబా ఈ మహానగరంలో అత్యంత కీలకప్రాంతం. ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ వంటి పర్యాటక ప్రదేశాలు కలిగిన కొలాబోలో  అధిక వర్షపాతం నమోదయ్యింది. గత 46 సంవత్సరాల్లో.. ఆగస్టు నెలలో.. ఒక్క రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు అధికారులు. 

గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టు నెల పూర్తి వర్షపాతంలో దాదాపు 64 శాతం వాన ఈ ఐదు రోజుల వ్యవధిలోనే నమోదయినట్లు అధికారులు తెలిపారు. 

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

1974 ఆగస్టులో కురిసిన భారీ వర్షం తర్వాత ఈ సంవత్సరం ఆగస్టు బుధవారం 24 గంటలలోపు 331.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిన ముంబై సరికొత్త చరిత్ర సృష్టించింది. అధిక వర్షపాతంలో దక్షిణ ముంబై మొత్తంగా నీట మునిగింది. బుధవారం మెరీనా డ్రైవ్ వాస్తవంగానే కనిపించకుండా పోయిందంటే కుండపోత వర్షం ప్రతాపం అర్థమవుతుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నగరంలో అధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అత్యవసర సే వలు మినహా అన్ని కార్యాలయాలను మూసివేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   20 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   19 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   18 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle