newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నీట్-జేఈఈ పరీక్షల వాయిదాకు తెలుగు సీయంల సాయం కోరిన స్టాలిన్

28-08-202028-08-2020 08:01:17 IST
Updated On 28-08-2020 09:08:51 ISTUpdated On 28-08-20202020-08-28T02:31:17.524Z28-08-2020 2020-08-28T02:31:04.378Z - 2020-08-28T03:38:51.655Z - 28-08-2020

 నీట్-జేఈఈ పరీక్షల వాయిదాకు తెలుగు సీయంల సాయం కోరిన  స్టాలిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో నీట్-జేఈఈ పరీక్షలను యథావిధిగా నిర్వహించేందుకు టెస్టింగ్ ఏజెన్సీ సిద్ధం కావడంపై బీజేపీయేతర విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పరీక్షలు ఈ యేడాది నిర్వహించకుండా వాయిదా వేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

అంతేకాదు మిగతా రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన జగన్, కేసీఆర్‌లను ఇందుకు కలిసి రావాలంటూ  పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఒడిశా, కేరళ సహా మరో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు.

ఇదిలా వుంటే నీట్-జేఈఈ నిర్వహణపై విద్యార్థులు సుముఖంగానే ఉన్నారని, ఇప్పటికే 17 లక్షల మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులు సైతం డౌన్‌లోడ్ చేసుకున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించడం మంచిదని 150 మందికి పైగా ప్రొఫెసర్లు ప్రధాని మోడీకి లేఖరాసిన సంగతి తెలిసిందే. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

నీట్-జేఈఈ నిర్వహణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. సోనియా గాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలు పరీక్షల నిర్వహణతో పిల్లల్ని ఇబ్బందులకు గురిచేయవద్దని అంటున్నాయి.

ముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి.  దీనిపై తాము ఏ నిర్ణయమూ తీసుకోలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి రావాలని స్టాలిన్ పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో జగన్, కేసీయార్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle