newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నివురుగప్పిన నిప్పులా కర్నాటకం

15-09-201915-09-2019 08:45:27 IST
2019-09-15T03:15:27.721Z15-09-2019 2019-09-15T03:14:25.945Z - - 20-04-2021

నివురుగప్పిన నిప్పులా కర్నాటకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటకలో తుపాను ముందటి నిశ్శబ్దం తాండవిస్తున్నది. కర్నాటకలో కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఫిరాయింపుల, అసమ్మతుల తిరుగుబాట్లతో ప్రభుత్వం కూలిపోయి యెడియూరప్ప నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పడటం వరకూ నిత్యం రాజకీయ సందడి, అస్థిరత, విమర్శలు, ప్రతి విమర్శలతో అతలాకుతలమైన రాజకీయ వాతావరణం...గత కొద్ది కాలంగా స్తబ్దంగా ఉంది.

శాసనసభా వేదికగా కుమార స్వామి విశ్వాస పరీక్షలో విఫలం చెందడంతో అధికార పగ్గాలను బీజేపీ చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా యెడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంతివర్గ ఏర్పాటుతో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. 

అధిష్ఠానం ఆమోదంతో ఏర్పాటైన యెడియూరప్ప కేబినెట్ లో ఆయన సన్నిహిత అనుచరులకే స్థానం లేకపోవడంతో యోడియూరప్ప సీఎం పదవి ఉన్నా బలహీనుడయ్యారనే చెప్పాలి. కుమారస్వామి సర్కార్ ఎంత బలహీనంగా ఉండేదో...ఇప్పుడు యెడియూరప్ప సర్కార్ సైతం అంతే బలహీనంగా ఉంది.

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల ఊసుకూడా లేకుండా కర్నాటకం స్తబ్దుగా ఉంది. అసలు కర్నాటకలో ప్రభుత్వం కొలువుదీరి ఉందా అన్న సందేహం సామాన్యులకు కలిగేలా ఉంది. రాజకీయ కార్యకలాపాలే కాదు, ప్రభుత్వ పాలన సాగుతున్నదా అన్న అనుమానం జనబాహుల్యంలో వ్యక్తమౌతున్నది. 

నిత్యం రాజకీయ సందడితో ఉండే కర్నాటకలో ఇప్పుడు నిశ్శబ్దం తాండవిస్తున్నది. యెడియూరప్ప కేబినెట్ లో 17 మంది మంత్రులు కొలువుదీరిన క్షణం నుంచీ అసమ్మతి సెగ రాజుకుందనే చెప్పవచ్చు. కేబినెట్ లో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు స్థానం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడమే రాష్ట్రంలో పార్టీపై కానీ, ప్రభుత్వంపై కానీ అధిష్టానానికి పట్టు లేదనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

కాంగ్రెస్, జెడీఎస్ సర్కార్ ను కూలదోయడానికి అసమ్మతిని రెచ్చగొట్టి రెబల్స్ కు పదవుల ఆశచూపి రాజకీయం చేసిన బీజేపీ తీరా అధికారం దక్కిన తరువాత ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. సహజంగా యెడియూరప్ప కేబినెట్ లో తప్పని సరిగా స్థానం దక్కుతుందని భావించి ఆయన అనుయాయులు మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయారు. 

బీజేపీ అధిష్టానం యెడియూరప్పకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో మంత్రివర్గ కూర్పును నిర్దేశించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పుడు యెడియూరప్ప అనుయాయుల నుంచే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నది. రాష్ట్ర బీజేపీలోని వివిధ నాయకుల అనుచరులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపించారు.

ముఖ్యంగా కేఎస్ ఈశ్వరప్ప, బీ. శ్రీరాములు వంటి నేతల అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమ నేతలకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అశోక్, సీటీ రవి వంటి నేతలు సైతం తమ అసంతృప్తిని, అసమ్మతిని దాచుకోవడానికి ఇసుమంతైనా ప్రయత్నించలేదు. ఇక మంత్రివర్గంలో స్థానం దక్కిన వారు కూడా తమకు దక్కిన మంత్రిత్వ శాఖల పట్ల సంతృప్తిగా లేరు. 

మంత్రివర్గ కూర్పు, మంత్రిత్వ శాఖల కేటాయింపు పట్ల అసమ్మతి భగ్గుమనడం అంటే ముఖ్యమంత్రి యెడియూరప్ప, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పట్ల అసమ్మతి వ్యక్తం చేసినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే మంత్రివర్గ సభ్యుల ఎంపిక నుంచీ, మంత్రిత్వ శాఖల కేటాయింపు వరకూ అన్నీ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పర్యవేక్షించి నిర్ణయించారు.

ఇప్పటికిప్పుడు అసమ్మతి భగ్గుమనడం లేదు..కానీ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి ముప్పు ఉందన్న సూచనగా ఒక రకమైన ఇబ్బందిక నిశ్శబ్దం పార్టీలో తాండవిస్తున్నది. ఆ నిశ్శబ్దం తుపాను ముందు ప్రశాంతతగా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్నా...రాష్ట్రంలో, పార్టీపై బీజేపీ పట్టు సాధించలేదనడానికి ఈ అసహజ నిశ్శబ్దాన్ని తార్కానంగా చెప్పవచ్చు. అసమ్మతి గళాల నుంచి ప్రజల, పార్టీ కేడర్ దృష్టి మరల్చే విధంగా డీకే శివకుమార్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు కేసులు వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటికీ...‘కర్‘నాటకం తెరపడినట్లు కాదనీ, క్లైమాక్స్ కు ముందు వచ్చే చిన్న విరామమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం యెడియూరప్పకు నల్లేరు మీద బండి నడకలా లేదని చెప్పడానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle