నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ ఎంపీ వ్యక్తిగత విమర్శలు..
14-09-202014-09-2020 18:36:28 IST
2020-09-14T13:06:28.146Z14-09-2020 2020-09-14T13:06:23.880Z - - 11-04-2021

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ వ్యక్తిగత విమర్శలు చేయడంపై లోక్ సభలో వివాదం చెలరేగింది. విపక్ష సభ్యుడి అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. లోక్‌సభలో సోమవారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సౌగత రాయ్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక దుస్థితి నిర్మలా సీతారామన్ కష్టాలను పెంచిందని వ్యాఖ్యానించారు. సౌగత రాయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పట్టుబట్టారు. సీనియర్ సభ్యురాలిపై రాయ్ వ్యాఖ్యలను పాలక పక్ష సభ్యులు తప్పుపట్టారు. ఇది మహిళా సభ్యురాలిని అవమానించడమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయలేదని సౌగత్ రాయ్ చెప్పారు. చివరికి ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని కోరారు. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి అని తెలుపడంతో తెలుపడంతో ఈ పరీక్షలు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా 13న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో 17 మంది వైరస్ బారిన పడినట్లు స్పష్టమైంది. పాజిటివ్ వచ్చిన వారిలో బీజేపీకి చెందిన 12 మంది సభ్యులుండగా, వైసీపీకి చెందిన ఇద్దరు, డీఎంకే, ఆర్ఎల్పీ పార్టీలకు చెందిన ఒక్కొక్కరున్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా మరో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా